Big Stories

Protiens : మాంసాహాన్ని మించిన ప్రొటీన్‌ వీటి సొంతం

Protiens : చాలా మంది శరీరానికి సరిపడా ప్రొటీన్‌ అందక నాన్‌వెజ్‌ వైపు మొగ్గుచూపుతారు. అయితే శాఖాహారులకు మాత్రం కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. మాంసం కంటే బలమైన, అతి తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే ధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇవి మన వంటింట్లో దోరికేవే అయినా వీటి ప్రొటీన్ల గురించి మనకు తెలియదు. ఆకుపచ్చని పెసలలో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అరటిపండు కంటే కూడా వీటిలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. కండరాల నిర్మాణం, కండరాల్లో నొప్పులు లేకుండా ఇది దోహదం చేస్తుంది. పచ్చి శెనగపప్పులో కూడా మిగతా ధాన్యాలతో పోలిస్తే ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. 100 గ్రాముల పప్పులో 22 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. మధుమేహం రోగులకు ఇవి చాలా మంచివి. ఎర్ర కందిపప్పులోనూ అధికశాతం ప్రోటీన్ ఉంటుంది. అర కప్పు కందిపప్పులో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. దీంతో పాటు ఐరన్, ఫైబర్, బి6, బి2, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్, కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మందికి ఎర్ర కందిపప్పు అంటే తెలియదంటున్నారు. ఈ పప్పుతో కూడా కూర చేసుకుంటారు. మినపప్పు విషయానికి వస్తే ఈ అరకప్పు మినపప్పులో 12 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్‌, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మినపప్పు మన గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది, ఎముకల ఆరోగ్యం, జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది, నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News