BigTV English

Meta : మొన్న మస్క్.. నేడు మార్క్.. వేల ఉద్యోగుల తొలగింపు..

Meta : మొన్న మస్క్.. నేడు మార్క్.. వేల ఉద్యోగుల తొలగింపు..


Meta : అనుకున్నదంతా అయింది. 18 ఏళ్ల ఫేస్ బుక్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా… దాని మాతృసంస్థ మెటా… వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఈ ప్రకటన చేసి… గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఊహాగానాల్ని నిజం చేశాడు. వేల మంది ఉద్యోగుల సమక్షంలో మాట్లాడిన జుకర్ బర్గ్… సంస్థ అభివృద్ధిని ఎక్కువగా అంచనా వేశానని… అందుకే ఎక్కువ మంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్నానని… జరిగిపోయిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పాడు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెటాలో 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఎంత మందిని తీసేయబోతున్నామనేది మార్క్ కచ్చితంగా చెప్పకపోయినా… వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వేటు పడే ఉద్యోగుల్లో రిక్రూటింగ్, బిజినెస్‌ టీమ్ గ్రూప్‌ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. ఉద్యోగాల నుంచి తీసేసిన వారికి కనీసం నాలుగు నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వబోతున్నట్లు మెటా HR చీఫ్ లోరీ గోలెర్ తెలిపారు.


ఇటీవల మెటా ఆదాయం భారీగా తగ్గిపోవడం, ఖర్చులు విపరీతంగా పెరగడం… భవిష్యత్ లోనూ సంస్థ ఆదాయం ఏ మాత్రం మెరుగుపడే సూచనలు లేకపోవడంతో… సంస్థ నుంచి భారీగా ఉద్యోగులను తొలగించవచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దానికి తగ్గట్టే… ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాక మాట్లాడిన జుకర్ బర్గ్… సంస్థలో కొత్త నియామకాలు చేపట్టబోమని, సిబ్బంది సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటామని చెప్పాడు. అయితే.. అది ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తామన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. కానీ… ఏ క్షణమైనా జుకర్ బర్గ్ ఉద్యోగులు తొలగింపుపై ప్రకటన చేయొచ్చని భావించారు. అంతా అనుకున్నట్లే… ట్విట్టర్ కొత్త బాస్ మస్క్ రూట్లోనే.. వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నామని అధికారికంగా ప్రకటించాడు… మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×