BigTV English

MG ‘Comet’ Kahani:-ఎంజీ ‘కామెట్‌’ కహానీ

MG ‘Comet’ Kahani:-ఎంజీ ‘కామెట్‌’ కహానీ

MG ‘Comet’ Kahani:-భారతదేశంలో కామెట్ పేరుతో త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టబోతోంది… ఎంజీ మోటార్. ఇప్పటికే ఉన్న హెక్టర్, గ్లోస్టర్ల మాదిరే… కామెట్ అనే పేరు కూడా ఓ విమానానికి చెందినదే కావడం విశేషం. ఇది రోడ్డెక్కితే… భారతదేశంలో తిరిగే అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ అవుతుంది.


చూడ్డానికి మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ రేవాలా కనిపిస్తున్నా… దాని కంటే కామెట్ కాస్త పెద్దది. దీని పొడవు 2.9 మీటర్లు. 20 కిలోవాట్ల బ్యాటరీతో ఒక మోడల్, 25 కిలోవాట్ల బ్యాటరీతో మరో మోడల్ తీసుకొస్తున్నారు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే కామెట్ 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఎంజీ మోటార్ చెబుతోంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 40 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక దీని ధర రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

కామెట్ అనే పేరును ఈ కారుకు పెట్టడానికి ప్రేరణ… 1934లో ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మాక్‌ రాబర్ట్‌సన్‌ ఎయిర్‌రేస్‌లో పాల్గొన్న బ్రిటిష్‌ విమానం. దాని పేరే కారుకు పెట్టారు. ఇంతకుముందు ఎస్‌యూవీకి పెట్టిన హెక్టర్ పేరు కూడా… 1930లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన ఫైటర్ బ్రిటిష్ బైప్లేన్ పేరే. అలాగే గ్లోస్టర్‌ అనే పేరు కూడా… 1941లో మొదటిసారిగా ఎగురవేయబడిన ఒక మోడల్ జెట్-ఇంజిన్ విమానం పేరు.


కామెట్ పేరును ప్రకటించిన సందర్భంగా… ప్రతి ఒక్కరికీ మెరుగైన భవిష్యత్తు కోసం పరిష్కారాలు వెతికే క్రమంలో ఇంకా చాలా ఆవిష్కరణలు చేస్తామని ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం వాహన డిజిటల్‌ యుగంలోకి అడుగుపెట్టిందని… అందుకే పెద్ద సంఖ్యలో ఆవిష్కరణలతో పాటు, భవిష్యత్‌ తరాలకు తగ్గట్లు సాంకేతికతలు, స్వచ్ఛ రవాణాకు అవసరమైన ప్రత్యేక డిజైన్‌లు.. ఇలా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×