BigTV English

Pakistans : పాక్ వెనుక ఒకేఒక్కడు!

Pakistans : పాక్ వెనుక ఒకేఒక్కడు!

Pakistans : T20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలోనే వెనుదిరగాల్సిన పాకిస్థాన్… ఫైనల్ దాకా చేరగలిగిందంటే… అదృష్టంతో పాటు మరో వ్యక్తి కూడా కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అతనే… మాథ్యూ హేడెన్. ఒకప్పుడు ఆస్ట్రేలియా తరఫున ఆడి భారత్ కు కొరకరానికొయ్యలా ఉన్న హెడెన్… ఇప్పుడు తన అనుభవాన్నంతా రంగరించి… పాక్ ఫైనల్ చేరేలా చేశాడు.


ప్రస్తుతం మాథ్యూ హెడెన్‌ పాకిస్తాన్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న హెడెన్ ను పాక్ ఎప్పుడైతే మెంటార్‌గా ఏంచుకుందో… అప్పుడే సగం సక్సెస్‌ అయింది. అయితే… పాక్ జట్టుపై హెడెన్‌ ప్రభావం చాలా నెమ్మదిగా పనిచేసింది. కీలకమైన సెమీస్ మ్యాచ్ లో… హెడెన్ ఎఫెక్ట్ పూర్తిస్థాయిలో బయటపడింది. ముందు ఫీల్డింగ్ చేయాల్సి వస్తే కివీస్‌ను ఎలా కట్టడి చేయాలో పాక్ బౌలర్లకు నూరిపోసిన హెడెన్… ఆ తర్వాత కివీస్ బౌలర్లను ఎలా ఆటాడుకోవాలో పాక్ బ్యాటర్లకు పూసగుచ్చినట్టు వివరించాడు. అందుకే… సూపర్-12 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చితగ్గొట్టిన కివీస్ బ్యాటర్లు… సెమీస్ లో పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోయారు. దాదాపు అన్ని జట్లపైనా అద్భుతంగా బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ బౌలర్లను… అసలు ఫామ్‌లోనే లేని బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ ఉతికారేయడం వెనుక కూడా… హెడెన్ హ్యాండ్ ఉంది.

పాక్ గెలుపు వెనుక హెడెన్ కృషి ఉంది కాబట్టే… మ్యాచ్‌ ముగియగానే అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చిన కెప్టెన్‌ బాబర్‌ ఆజం… ప్రేమగా హత్తుకున్నాడు. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. అసలు పాకిస్థాన్ జట్టు సూపర్‌-12 దశ దాటుతుందా? లేదా? అని… ఆ టీమ్ యజమాన్యానికే నమ్మకం లేదు. కానీ… హెడెన్‌ మాత్రం తమ కుర్రాళ్లు తప్పకుండా రాణిస్తారని.. ఈసారి కప్‌ పాకిస్తాన్‌దే అని ప్రతీ మ్యాచ్‌కు ముందు చెబుతూ వస్తున్నాడు. దానికి తగ్గట్టే పాకిస్థాన్ ను ముందుండి నడిపిస్తున్నాడు. మొత్తమ్మీద పాక్ ఫైనల్ చేరగలిగిందీ అంటే… పూర్తిగా హెడెన్ వల్లేనని అంటున్నారు.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×