BigTV English

Mosquito Facts : ఇలా చేస్తే దోమలు మీ దగ్గరికి రావు

Mosquito Facts : ఇలా చేస్తే దోమలు మీ దగ్గరికి రావు

Mosquito Facts : సీజన్‌ ఏదైనా దోమలు మనల్ని విడిచిపెట్టవు. దోమల బారి నుంచి తప్పించుకునేందుకు కాయిల్స్‌, ఓడోమస్‌లాంటి క్రీములు కూడా వాడుతుంటారు. అయితే దోమలకు కొన్ని రకాల వాసనలు పడవు. వెల్లుల్లి వాసన అంటే దోమలకు నచ్చదు. వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి రూమ్‌లో స్ప్రే చేసినా మన శరీరానికి రాసుకున్నా దోమలు మీ దగ్గరికి రావు. తులసి ఆకుల వాసన కూడా దోమలకు పడదు. తులసి ఆకుల నూనె మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దాన్ని శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి. పుదీనా వాసన దోమలకు అస్సలు నచ్చదు. ఈ నూనెను ఉపయోగించడం వల్ల దోమల బెడద తగ్గుతుంది. నిమ్మగడ్డి కూడా దోమలు రాకుండా అడ్డుకుంటుంది. దోమలను తరమడంలో వేప ఆకులు, వేప నూనె బాగా పనిచేస్తాయి. ఇంట్లో వేప ఆకుల పొగ వేయాలి. శరీరానికి వేప నూనె రాయాలి. వేప నూనెను స్ప్రే కూడా చేయవచ్చు. దీంతో దోమలు పారిపోతాయి.


అయితే కొన్ని పదార్థాలకు దోమలు ఆకర్షితులవుతాయి. ఒక మనిషిని దోమలు ఆకర్షించేందుకు అతని జన్యువులు కారణం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకరిని దోమలు బాగా కుడితే అతని పిల్లలను కూడా ఎక్కువగా కుట్టే అవకాశాలు 85శాతం ఉంటాయని చెబుతున్నారు. మనం శ్వాసతీసుకుని వదిలే కార్బన్‌ డయాక్సైడ్‌కు కూడా దోమలు ఆకర్షితమవుతాయి. కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లు, సబ్బులలు సైతం దోమలను ఆకర్షిస్తాయి. O గ్రూప్‌ రక్తం ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయట. మన చెమటకు కూడా దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయని అంటున్నారు. వదులు దుస్తులను వేసుకోవడం వల్ల దోమలు కుట్టడాన్ని ఎక్కువశాతం తగ్గించుకోవచ్చు. అలాగే లైట్‌ కలర్‌ బట్టలు వేసుకోవాలి, డార్క్‌ కలర్‌ ఉంటే దోమలు దరిచేరుతాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×