BigTV English

Mothers milk : బాలింతలు పాలు పెరగాలంటే ఇలా చేయండి

Mothers milk : బాలింతలు పాలు పెరగాలంటే ఇలా చేయండి

Mothers milk : చిన్నారులకు తల్లి పాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. తల్లి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంతో పిల్లలు చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులుగా మారుతారు. అందుకే చిన్నారులకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాలని వైద్యులు చెబుతుంటారు. కొందరు బాలింతలలో పాలు బాగా ఉత్పత్తి కావు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. కప్పు నీటిలో స్పూన్‌ మెంతులు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో స్పూన్‌ తేనె కలిపి తాగాలి. ఇలా రోజుకు మూడుసార్లు తాగితే బాలింతల్లో పాలు బాగా పెరుగుతాయి. మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్‌ పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మునగకాయల పైన ఉండే పొట్టు తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి. దాన్ని అర కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగితే మంచి ఫలితం ఉంటుంది. బాలింతల్లో పాలు ఉత్పత్తి కావడానికి సోంపు గింజలు కూడా బాగా పనిచేస్తాయి. ఒక పాత్రలో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. వెల్లుల్లిలో లాక్టోజెనిక్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి బాలింతల్లో పాలను బాగా పెంచుతాయి. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి నేరుగా తినాలి. దీంతో పాలు ఉత్పత్తి అవుతాయి. దాల్చిన చెక్కతో డికాషన్‌ తయారు చేసుకుని తాగాలి. లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి అవుతాయి. రోజూ నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తినడం, బాదం పాలు తాగడం వల్ల బాలింతల్లో పాలు పెరుగుతాయి. వీటితో పాటు ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలి. స్తనాలను రోజూ సున్నితంగా మర్దనా చేయాలి. బిగుతైన లోదుస్తులు ధరించకూడదని నిపుణులు అంటున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×