BigTV English

Musk dragged to court by ex-employees : పీకేస్తే ఊరుకుంటామా?

Musk dragged to court by ex-employees : పీకేస్తే ఊరుకుంటామా?

Musk dragged to court by ex-employees : ఇప్పుడు ఇదే డైలాగ్ వస్తోంది… ట్విట్టర్ మాజీ ఉద్యోగుల నుంచి. సంస్థను చేజిక్కించుకున్న తర్వాత పర్మినెంట్, టెంపరరీ ఎంప్లాయిస్ కలిపి మొత్తం పది వేల మందికిపైగా తొలగించాడు… ఎలాన్ మస్క్. తొలినాళ్లలో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా మౌనంగా కొత్త ఉద్యోగం వెతుక్కుంటే… మస్క్ కారణంగా అనేక ఇబ్బందులు పడి సంస్థను వీడిన వాళ్లు మాత్రం… అంత తేలిగ్గా మస్క్ ను విడిచిపెట్టేట్టు కనిపించడం లేదు. మస్క్ ను కోర్టు మెట్లు ఎక్కించాల్సిందేనని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా ఇప్పటికే శాన్‌ ఫ్రాన్సిస్కో కోర్టులో వందల సంఖ్యలో దావాలు దాఖలయ్యాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు… 24 గంటలూ ఉద్యోగుల్ని ఆఫీసులోనే ఉంచేందుకు వీలుగా బెడ్‌రూమ్‌లు ఏర్పాటు చేయడంపైనా కోర్టుకు ప్రైవేట్‌ ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో… మస్క్ ముందుంది మొసళ్ల పండగ అని అంటున్నారు… నెటిజన్లు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ని అన్న అహంకారంతో… ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగుల హక్కుల్ని కాలరాసేయడంతో పాటు చట్టాల్ని కూడా తుంగలో తొక్కుతున్నాడని లాయర్లు ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ నుంచి తీసేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని చెబుతున్నారు. దీనిపైనా మస్క్ కు వ్యతిరేకంగా కోర్టులో దావా వేయించారు… కొందరు ట్విట్టర్ మాజీ ఉద్యోగులు. ఇలాంటివన్నీ మస్క్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ… కోర్టు ముందు మాత్రం అతను తలొంచాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ట్విట్టర్ కొనేందుకు ముందుకొచ్చి… ఆ తర్వాత తూచ్ అన్న మస్క్… కోర్టుకు భయపడే ట్విట్టర్ డీల్ పూర్తి చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దాంతో… ఇప్పటికైనా మాజీ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు… 24 గంటలూ ఉద్యోగుల్ని ఆఫీసులోనే బంధించే ప్రయత్నాలు మానుకోవాలని… అప్పుడే కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి రాదని మస్క్ కు సూచిస్తున్నారు. మరి మాజీ ఉద్యోగుల ప్రయత్నాలకు మస్క్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×