BigTV English

Musk:మస్క్ బలుపు మామూలుగా లేదు..

Musk:మస్క్ బలుపు మామూలుగా లేదు..

Musk:ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ట్విట్టర్ కొత్త సీఈవో అంటూ… ఓ కుక్క ఫోటోను షేర్ చేశాడు. అక్కడితో ఆగి ఉంటే ఫరవాలేదు కానీ… గతంలో పని చేసిన సీఈవో కన్నా కొత్త సీఈవో చాలా బెటర్ అంటూ… పరోక్షంగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్‌ను కించపరిచాడు. దాంతో మస్క్ మీద నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఎంత డబ్బు పోసి ట్విట్టర్ కొంటే మాత్రం… ఇంత బలుపు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు.


ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వెళ్లకముందు… ఆ సంస్థ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ పనిచేశారు. ట్విట్టర్ డీల్ పూర్తి చేయకుండా మస్క్ సాగదీస్తుంటే… సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ గద్దె విజయ, సీఎఫ్ఓ నెల్ సెగల్… పోరాడి మరీ మస్క్ మీద పైచేయి సాధించారు. దాంతో వాళ్లపై కక్ష పెంచుకున్న మస్క్… ట్విట్టర్ కొన్న వెంటనే ముగ్గుర్నీ ఉద్యోగాల్లో నుంచి తీసేశాడు. వారి మీద కోపం ఇంకా చల్లారలేదేమో… ఇప్పుడు ట్విట్టర్ కొత్త సీఈఓ అంటూ తన పెంపుడు కుక్కను ఓ సీట్లో కూర్చోబోట్టిన ఫోటోను షేర్ చేసి… పాత సీఈఓ కంటే బెటర్ అని పరోక్షంగా పరాగ్ అగర్వాల్‌ను కించపరిచాడు… మస్క్.

‘ఫ్లోకి షిబా ఇను’ అనే తన పెంపుడు కుక్కకు సీఈఓ అని రాసి ఉన్న బ్లాక్ టీ షర్ట్ తొడిగి… దాన్ని ట్విట్టర్ సీఈవో సీట్లో కూర్చోబెట్టాడు… మస్క్. కుక్క ముందు ఉన్న టేబుల్ మీద కొన్ని ట్విట్టర్ లోగోతో కొన్ని పేపర్లు కూడా పెట్టాడు. అత్యవసరంగా ఏదైనా ఈ మెయిల్ పంపాలనుకుంటే… పంపేందుకు వీలుగా ట్విట్టర్ లోగో ఉన్న ఓ ల్యాప్‌టాప్ కూడా కుక్క ముందు ఉంచాడు. అన్నింటినీ ఫోటో తీసి ట్విట్టర్లో షేర్ చేసిన మస్క్… ట్విట్టర్ కొత్త సీఈఓ అద్భుతమైనదని… ఇది పరాగ్ అగర్వాల్ కంటే బాగా పని చేస్తుందని రాసుకొచ్చాడు. మస్క్ వైఖరిపై ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×