BigTV English

For Baby’s Healthy Heart: గర్భిణీ స్త్రీలకు కొత్త డైట్.. బేబీ హార్ట్ కోసం..

For Baby’s Healthy Heart: గర్భిణీ స్త్రీలకు కొత్త డైట్.. బేబీ హార్ట్ కోసం..

For Baby’s Healthy Heart:ఈరోజుల్లో ప్రెగ్నెన్సీ కూడా ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న విషయంగా మారిపోయింది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో తల్లిని, బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతే కాకుండా ఒకవైపు పరిశోధకులు కూడా ఈ విభాగంలో మెరుగైన చికిత్స ఎలా అందించవచ్చని, ఔషధాలు ఎలా ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటాయని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.


తాజాగా ఆస్ట్రేలియాలోని హార్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు తల్లి గర్భంలో ఉండే బిడ్డ హార్ట్ హెల్త్ కోసం ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టారు. బిడ్డ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. తల్లులు ఒక మెడిటెర్రానియన్ డైట్‌ను ఫాలో అవ్వాలని వారి పరీక్షల్లో తేలింది. మైక్రో, మాక్రోన్యూట్రియంట్స్‌పై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఇది బేబి హార్ట్ ఆరోగ్యంగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ముందుగా స్పెయిన్ శాస్త్రవేత్తలు ఈ విభాగంలో పరిశోధనలు మొదలుపెట్టారు. ఇప్పుడు హెచ్ఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలను ముందుకు తీసుకెళ్తున్నారు. 1200 మంది గర్భిణీ స్త్రీలపై ఈ పరిశోధనలు జరిగాయి. మెడిటెర్రానియన్ డైట్ అనేది కేవలం పిల్లల గుండెలు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును కూడా కరెక్ట్‌గా పెరిగేలా సహాయపడుతుందని వారు గమనించారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 100 పిల్లలో ఒకరు కాగ్నెన్షియల్ హార్ట్ డిసీస్ (సీహెచ్‌డీ)తో పుడుతున్నారు. ఈ డైట్.. అలాంటి పిల్లలకు సహాయపడుతుందని వారు భావిస్తున్నారు.


మెడిటెర్రానియన్ డైట్ వల్ల సీహెచ్‌డీ, దానికి సంబంధించిన ఇతర గుండె జబ్బుల నుండి పిల్లలను దూరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కూడా ఈ డైట్ ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా పెరగకపోతే.. పుట్టిన తర్వాత కూడా వారు అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు బయటపెట్టారు. అంతే కాకుండా వారి జీవితకాలం కూడా చాలావరకు తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్ల వల్ల ఆడవారు.. గర్భం దాల్చిన తర్వాత అతిబరువు సమస్య వల్ల బాధపడుతున్నారని, ఇది పుట్టబోయే బిడ్డలకు మంచిది కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గర్భిణీ స్త్రీలలో ఒబిసిటీ, డయాబెటీస్ లాంటి సమస్యలు పిల్లల మాల్ఫార్మేషన్స్‌కు కారణమవుతాయని వారు అంటున్నారు. ఇలా గర్భిణీ స్త్రీలలో వచ్చే ఎన్నో సమస్యలను మెడిటెర్రానియన్ డైట్ చాలావరకు అదుపుచేయగలదని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×