BigTV English

Musk loses number one spot among rich : అలా పడి.. ఇలా లేచి..

Musk loses number one spot among rich : అలా పడి.. ఇలా లేచి..

Musk loses number one spot among rich : మస్క్ స్థానానికి ఎసరొచ్చింది. ఇప్పటిదాకా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో తొలిస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్… ఫోర్బ్స్ తాజా జాబితాలో రెండోస్థానానికి పడిపోయి… ఆ తర్వాత మళ్లీ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనడం, టెస్లా షేర్లు భారీగా పతనం కావడంతో… మస్క్ సంపద పడుతూ లేస్తూ ఉంది. మస్క్‌ రెండో స్థానానికి పరిమితమయ్యాక… ఫ్రెంచ్‌ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా నిలిచినట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది. అయితే, వ్యక్తిగత సంపదను పెంచుకున్న మస్క్‌… మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్నాల్ట్‌ సంపద విలువ 184.7 బిలియన్‌ డాలర్లు కాగా… మస్క్‌ సంపద 185.4 బిలియన్‌ డాలర్లు. ఇద్దరి సంపదలో వ్యత్యాసం కేవలం ఒక బిలియన్ డాలర్ల కన్నా తక్కువే ఉండటంతో… ఏ క్షణమైనా మొదటి స్థానం నుంచి మస్క్ మళ్లీ పడిపోయే అవకాశం ఉంది.


2021 సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను వెనక్కి నెట్టి… ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి టాప్ ప్లేస్ నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లో మస్క్ సంపద ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు దాటింది. అయితే… ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత మస్క్ సంపద సగటున రోజూ రూ.2,500 కోట్ల మేర హరించుకుపోతోందని బ్లూమ్‌బెర్గ్‌ వెల్త్ ఇండెక్స్ వెల్లడించింది. మస్క్‌కు చెందిన విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా షేరు విలువ రెండేళ్లుగా తగ్గిపోతూనే ఉండటంతో… ఈ ఏడాది మస్క్‌ సంపద విలువ ఇప్పటిదాకా 101 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. ఒక దశలో 340 బిలియన్ డాలర్ల గరిష్ఠస్థాయికి చేరిన మస్క్ సంపద విలువ… ప్రస్తుతం 185 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. అంటే… దాదాపు సగం సంపద ఆవిరైపోయింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×