Cji oath : భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేశారు. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు రెండేళ్లపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా పని చేశారు. జస్టిస్ వైవీ చంద్రచూడ్ 7 ఏళ్ల 5 నెలలపాటు సీజేఐగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఆయన 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జులై 11 వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు.
1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు డీవై చంద్రచూడ్ మహారాష్ట్రలో జన్మించారు. డీవై చంద్రచూడ్ కుమారులు అభినవ్, చింతన్ ఇద్దరూ లాయర్లే.
చదువు
ముంబైలోని కేథడ్రల్ జాన్‌కానన్‌లో పాఠశాల విద్య
1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఆనర్స్ డిగ్రీ
1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందిన డీవై చంద్రచూడ్
1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా
1986లో హార్వర్డ్‌లో జ్యూడిషియల్ సైన్సెస్ లో డాక్టరేట్
కెరీర్
బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు
1998లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా విధులు
2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
2013 అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి
2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం
అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్ఛిత్తి, ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం ఇలాంటి కీలక కేసుల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ చారిత్రక తీర్పులు ఇచ్చారు.