BigTV English

Musk: కరుగుతున్న కుబేరుడి సంపద

Musk: కరుగుతున్న కుబేరుడి సంపద

Musk: ట్విటర్‌ను ఏ ముహూర్తాన కొన్నాడో గానీ… అప్పటి నుంచి ఎలాన్ మస్క్‌కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచే కరగడం మొదలైన మస్క్‌ సంపద… ట్విటర్‌ను చేజిక్కించుకున్న తర్వాత సగటున రోజూ రూ.2,500 కోట్ల మేర హరించుకుపోతోందని బ్లూమ్‌బెర్గ్‌ వెల్త్ ఇండెక్స్ సూచించింది. ఈ సూచీలో అధికంగా సంపద కోల్పోతున్న వ్యక్తుల్లో మస్కే మొదటి స్థానంలో ఉన్నారు.


మస్క్‌కు చెందిన విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా షేరు విలువ రెండేళ్లుగా తగ్గిపోతూనే ఉంది. ఫలితంగా ఈ ఏడాది మస్క్‌ సంపద విలువ ఇప్పటిదాకా 101 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. ఒక దశలో 340 బిలియన్ డాలర్ల గరిష్ఠస్థాయికి చేరిన మస్క్ సంపద విలువ… ప్రస్తుతం 170 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే… ఇప్పటికే దాదాపు సగం సంపద ఆవిరైపోయింది.

హెడ్ లైట్ల సమస్య కారణంగా అమెరికాలో 3,21,000 టెస్లా కార్లను వెనక్కి పిలిపించడం, ముందు సీటు ఎయిర్‌బ్యాగ్‌లో సమస్యలు సవరించేందుకు మరో 30,000 మోడల్‌ ఎక్స్‌ కార్లను రీకాల్‌ చేయడంతో… తాజాగా టెస్లా కంపెనీ షేరు 3 శాతం నష్టపోయి రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. గరిష్ఠ స్థాయిల నుంచి కంపెనీ షేరు ధర ఇప్పటికే భారీగా పడటంతో… మార్కెట్‌ విలువ దాదాపు సగం మేర కోల్పోయింది. ఈ ఏడాది మొత్తం టెస్లా కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.


ఇప్పుడు సంపద విలువ ఈ స్థాయిలో కరిగిపోయినా… మస్క్ మాత్రం ముందుచూపుతో బాగానే లాభపడ్డాడు. టెస్లా షేరు నిరుడు గరిష్ట స్థాయి దగ్గర ఉన్నప్పుడు ఏకంగా 22 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశాడు… మస్క్. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో 8 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, ఆగస్టులో 7 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. ఏడాదిన్నర వ్యవధిలో 37 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేయడంతో… చాలా రోజుల తర్వాత 200 బిలియన్ డాలర్ల దిగువకు చేరిన మస్క్ సంపద… ట్విట్టర్ కొనుగోలు అనంతర పరిణామాలతో ఇప్పుడు 170 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినా… ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో ఇప్పటికీ మస్క్‌దే టాప్ ప్లేస్.

    Related News

    Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

    Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

    Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

    James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

    Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

    Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

    Big Stories

    ×