Mokshagna Teja : నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ్ డెబ్యూ మూవీపై ఇలాంటి చర్చ జరుగుతుందని నందమూరి ఫ్యాన్స్ ఎప్పడూ ఊహించి ఉండరు. ఎన్నో ఎళ్లు పాటు మోక్షజ్ఞ తేజ్ ఎంట్రీ కోసం ఎదురుచూసిన అభిమానులు ఇప్పుడు ఈ సినిమా గురించి జరుగుతున్న రచ్చ చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణమైన డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చేయాల్సిన మోక్షజ్ఞ తేజ్ ఫస్ట్ మూవీ ఇప్పుడు వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్లిపోయిందట.
నందమూరి ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు.?
ప్రశాంత్ వర్మ చేయాల్సిన మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎందుకు రద్దు అయింది..?
ఇప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ఎవరు డైరెక్టర్ చేస్తున్నారు..?
ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం పదండి…
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ ఎవరు..?
నందమూరి వంశంలో నుంచి సినిమా ఇండస్ట్రీకి మరో వారసుడు వస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోయారు. బాలయ్య చాలా రోజుల నుంచి ఎంట్రీ కోసం చెబుతూనే వచ్చాడు. తర్వాత హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఆ డెబ్యూ మూవీని హ్యాండీల్ చేస్తున్నాడంటే.. నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోయారు. సింబా ఈజ్ కమ్మింగ్ అంటూ ప్రశాంత్ వర్మ నుంచి అఫిషియల్ అప్డేట్ కూడా వచ్చింది. కానీ, సడన్‌గా ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ మూవీ రద్దు అయిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి.
తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీని కల్కి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ చేతికి వెళ్లినట్టు సమాచారం అందుతుంది. ఇండస్ట్రీలో టాక్ ప్రకారం… ప్రస్తుతం నాగ్ అశ్విన్‌తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన కథ గురించి బాలయ్య చర్చలు జరుపుతున్నారట. అంతా ఒకే అయితే, మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నాగ్ అశ్విన్ తోనే ఉండబోతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మించే ఛాన్స్ ఉంది.
మరో డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కూడా రెడీ…?
ప్రశాంత్ వర్మను మూవీ నుంచి తప్పించడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ చేయడానికి మరో డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ముందుకు వచ్చారట. వాళ్లే వెంకీ అట్లూరి, నాగ వంశీ. వీరి కాంబోలో బ్యాక్ టూ బ్యాక్ వచ్చిన సార్, లక్కీ భాస్కర్ మంచి హిట్ అయ్యాయి. వెంకీ అట్లూరి తర్వాత చేయబోయే సినిమా మరోసారి నాగ వంశీతోనే సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే ఉండబోతుంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ కోసం వెంకీ అట్లూరి ఓ హై పోటెన్షియల్ స్టోరీరి రెడీ చేస్తున్నాడట. కుదిరితే మోక్షు ఫస్ట్ మూవీ వెంకీ తోనే ఉండే ఛాన్స్ లేకపోలేదు అని తెలుస్తుంది. డెబ్యూ మూవీ కాకపోయినా… తర్వాత అయినా… వెంకీ అట్లూరి – మోక్షజ్ఞ తేజ్ – నాగ వంశీ కాంబోలో మూవీ రావొచ్చు..
ప్రశాంత్ వర్మతో ఎందుకు క్యాన్సిల్ ?
సింబా ఈజ్ కమ్మింగ్ అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడమే కాదు.. ఫస్ట్ లుక్‌నూ రిలీజ్ చేశాడు. తర్వాత లుక్ టెస్ట్ జరిగింది. ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఇన్ని జరిగిన తర్వాత మోక్షజ్ఞ తేజ్ డెబ్యూ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ ఎందుకు బయటికి వచ్చాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తుంది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే… ప్రశాంత్ వర్మకు డైరెక్షన్ చేయడం ఇష్టం లేదని, కథ మాత్రమే ఇస్తానని బాలయ్యతో చెప్పాడట. ఆ కథకు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం.
అన్ స్టాపబుల్ వల్లేనా..? బాలయ్య సీరియస్…?
మోక్షు డెబ్యూ మూవీ డైరెక్షన్ చేస్తా అని, స్టోరీ చెప్పేసి, లుక్ టెస్ట్ లు చేసిన తర్వాత మాట మార్చడంపై బాలయ్య సీరియస్ అయ్యారట. అన్నీ రెడీ చేసి ఇప్పుడు డైరెక్షన్ చేయను అనడం ఏంటి అని మండిపడ్డారట. ప్రశాంత్ వర్మ ఇలా చేయడం వెనక వేరే రీజన్ ఉందట. అన్ స్టాపబుల్ టైంలో టీజర్ డైరెక్షన్ కు ముందుగా ప్రశాంత్ వర్మనే సంప్రదించారట. అయితే, ఆ టైంలో కూడా ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ కు సంబంధించి భారీగా డిమాండ్ చేశాడట. దాదాపు 2 కోట్ల వరకు అడిగారట. అప్పుడు ఆహాతో పాటు బాలయ్యకు అది నచ్చలేదట. దీంతో ప్రశాంత్ వర్మను పక్కన పెట్టి, వేరే డైరెక్టర్‌తో టీజర్ ను షూట్ చేసి రిలీజ్ చేశారు.
ఇప్పుడు అదే విషయాన్ని మనసులో పెట్టుకుని మోక్షజ్ఞ మూవీకి డైరెక్షన్ చేయలేను అని ప్రశాంత్ వర్మ చెప్పాడనే టాక్ ఉంది. దీనిపై కూడా బాలయ్య సీరియస్ అయ్యారట. ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్, తన కొడుకు డెబ్యూ మూవీకి సంబంధం ఏంటని అన్నారట.
ఏది ఏమైనా… ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయలేకపోవడం, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ కాంబో క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. అలా ప్రశాంత్ వర్మ స్థానంలో నాగ్ అశ్విన్ రాబోతున్నట్టు సమాచారం. నాగ్ అశ్విన్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన మహానటి, కల్కి 2898 ఏడీ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.