BigTV English
Advertisement

NASA Experiment : రేపే (బుధవారం) చంద్రుడిపైకి ఆర్టెమిస్-1 ప్రయోగం చేపట్టనున్న నాసా

NASA Experiment : రేపే (బుధవారం) చంద్రుడిపైకి ఆర్టెమిస్-1 ప్రయోగం చేపట్టనున్న నాసా

NASA Experiment : ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడిన నాసా ఆర్టెమిస్ 1 ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ ప్రయోగానికి ఎట్టకేలకు కౌంట్ డౌన్ మొదలైంది. బుధవారం ఉదయం 11.34 గంటలకు ఆర్టెమిస్ 1 నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి నాసా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేప్ కెనావెరల్ నుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లోరిడాపై ఉష్ణమండల తుఫాను నికోల్ ప్రభావం చూపిన కొన్ని రోజులకే ఈ మిషన్ కు నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఇది చంద్రుడిపై స్థిర నివాసం ఏర్పాటు చేసే ప్రయోగాల్లో భాగంగా చేపడుతోంది. ప్రస్తుతం మానవరహిత ప్రయోగం మాత్రమే చేపడుతోంది నాసా. ఇది సక్సెస్ అయితే 2024లో ఆర్టెమిస్ 2 ప్రయోగం చేపట్టి అందులో వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించేలా నాసా ప్లాన్ చేసింది. ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్ 3 ప్రయోగాలను చేపట్టి చంద్రుడిపై మనుషులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోడానికి అనువైన పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.
నిజానికి ఆర్టెమిస్ 1 ప్రయోగం తొలుత ఆగస్టు 29న చేపట్టాలని భావించింది నాసా. కానీ అప్పుడు హరీకేన్ ముప్పుతోపాటు ఇంధనం లీకేజీ వల్ల వాయిదా వేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న ప్రయోగానికి సిద్ధమైంది. కానీ లిక్విడ్ హైడ్రోజన్ లీక్ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఆ తర్వాత నవంబర్ 14న ప్రయోగం చేపట్టడానికి రెడీ అయింది. కానీ ఇంతలో ఉష్ణమండల తుఫాను నికోల్ ప్రభావంతో ఆ ప్రయోగాన్ని కూడా నిలిపేసింది. ప్రస్తుతం చేపట్టబోయే ఈ మిషన్ లో ఓరియన్ క్యాప్యూల్ మానవ రహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి తిరిగిరానుంది.
50 ఏళ్ల క్రితం చంద్రుడిపైకి అపోలో ప్రాజెక్టు ద్వారా మనుషుల్ని పంపించింది నాసా. 1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తర్వాత మళ్లీ వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు జరగలేదు. ఇక ఇప్పుడు ఆర్టెమిస్ 1 ప్రయోగం సక్సెస్ అయితే… వచ్చే ఏడాది ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుడిపైకి మనుషులను పంపించడానికి వీలవుతుందని నాసా శాస్త్రవేత్తలు
భావిస్తున్నారు.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×