Big Stories

New Device:-పక్షవాతం పేషెంట్లకు కదలికలను ఇచ్చే డివైజ్..

New Device:- సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రోజురోజుకీ హెల్త్ సెక్టార్‌కు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంది. ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకోలేము అనుకున్నవారికి కొత్త జీవితాన్ని ఇస్తోంది. ఆర్టిఫిషియల్‌గా కాకుండా నేచురల్ పద్ధతిలో చాలా వ్యాధులకు చికిత్సను అందిస్తోంది. ఇలా మరెన్నో విధాలుగా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి తోడుగా ఉంటోంది. తాజాగా పక్షవాతం వచ్చినవారిలో కదలికలు తెస్తానంటోంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ.

- Advertisement -

యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు పక్షవాతం వచ్చిన పేషెంట్లపై ఫోకస్ పెట్టారు. అంతకంటే ముందుగా పక్షవాతం వచ్చిన ఎలుకలపై పరిశోధనలు చేపట్టారు. మామూలుగా పక్షవాతం వచ్చిన వారి బ్రెయిన్, కాళ్లు, చేతులు మధ్య కనెక్షన్ అనేది తొలగిపోతుంది. అందుకే బ్రెయిన్ సిగ్నల్స్‌ను కాళ్లు, చేతులు అందుకోలేక వాటిని కదిలించలేకపోతారు పేషెంట్లు. అయితే వాటి మధ్య కనెక్షన్‌ను మెరుగుపరచడానికి వారు ఒక పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం హ్యామన్ స్టెమ్ సెల్స్‌ను ఎలక్ట్రానిక్స్‌తో కలిపి కాళ్ల, చేతుల కదలికలకు కారణమవుతుందని వారు చెప్తున్నారు.

- Advertisement -

ఇప్పటివరకు పక్షవాతం వచ్చిన వ్యక్తుల మెదడు, కాళ్లు, చేతుల మధ్య కనెక్షన్‌ను పెంచడానికి ఎన్నో న్యూరల్ ఇంప్లాంట్స్ పరీక్షలు జరిగాయి. కానీ అవేవి లింబ్ ఫంక్షన్‌ను మామూలు స్థితికి తీసుకురాలేకపోయాయి. అంటే ఆ కోణంలో జరిగిన చాలావరకు పరిశోధనలు ఫెయిల్ అయిపోయాయి. ఎప్పటికప్పుడు ఎలక్ట్రోడ్స్ చుట్టూ స్కార్ టిష్యూలు ఏర్పడడమే డివైజ్‌కు, నెర్వ్‌కు మధ్య కనెక్షన్ పెరగలేకపోవడానికి కారణమని పరిశోధకులు గుర్తించారు.

కండరాల సెల్స్‌ను రీప్రోగ్రామ్ చేయడం ద్వారా ఎలక్ట్రోడ్స్, లివింగ్ టిష్యూల మధ్య కనెక్షన్ ఏర్పడుతుందని పరిశోధకులు గమనించారు. దీని వల్ల స్కార్ టిష్యూలు ఫార్మ్ అవ్వకుండా ఆగుతుంది. 28 రోజుల పాటు ఈ ప్రక్రియను కొనసాగించారు. ఇంత ఎక్కువకాలం ఇలాంటి ఒక పరిశోధన జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటికే బయోటెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు సాధించిన పరిశోధకులు.. ఈ ప్రయోగం కూడా అలాగే సక్సెస్ అయ్యిందని తెలిపారు. సెల్ థెరపీ, బయో ఎలక్ట్రానిక్స్‌ను ఒకే పరికరంలో జతచేర్చడం ద్వారా దీని ఫంక్షన్ మరింత మెరుగ్గా జరుగుతుందన్నారు.

పరిశోధకులు తయారు చేసిన ఈ పరికరం.. మనుషులపై ప్రయోగించడానికి ఇంకాస్త సమయంపడుతుందని వారు బయటపెట్టారు. కానీ కచ్చితంగా ఈ పరికరం అనేది అందుబాటులోకి వస్తే.. పక్షవాతం వచ్చిన వారిలో కూడా కదలికలు రప్పించే అవకాశం ఎక్కువగానే ఉందని వారు హామీ ఇస్తున్నారు. న్యూరల్ సర్క్యూట్స్ విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, దానిపై మరిన్ని పరిశోధనలు చేసి.. పూర్తిస్థాయిలో ఈ పరికరాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.

ఆస్ట్రానాట్స్ కండరాలపై ప్రత్యేక పరిశోధనలు..

for more updates follow this link:-bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News