Big Stories

Telangana: రెయిన్ అలెర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

Telangana: ఓవైపు భగ్గుమంటున్న ఎండలు.. మరోవైపు వర్షాలు. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు పది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

రాష్ట్రంలోని పలు చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.

- Advertisement -

ఈక్రమంలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచింది. ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని.. పంట చేతికొచ్చే సమయం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News