RRR: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ మూవీలను సైతం వెనక్కి నెట్టేసి.. ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. దిగ్గజ డైరెక్టర్లు ఈ మూవీకి ఫిదా అయిపోయారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు.
ఇక నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ పేరు మారుమ్రోగిపోయింది. అయితే ఆదే సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. ఆస్కార్ అవార్డును కొన్నారని.. కోట్లు ఖర్చు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీనిపై స్పందించారు రాజమౌళి కొడుకు కార్తికేయ. ఆర్ఆర్ఆర్ క్యాంపెయిన్‌కు అయిన ఖర్చుపై వివరణ ఇచ్చారు.
‘‘ఆస్కార్ క్యాంపెయిన్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. క్యాంపెయిన్‌కు మేము ఫిక్స్ చేసిన బడ్జెట్ కేవలం రూ. 5 కోట్లు. ఫస్ట్ ఫేజ్‌లో రూ. 3 కోట్లు ఖర్చు చేశాం. ఆ తర్వాత క్యాంపెయిన్ సమయంలో బడ్జెట్ పెరిగింది. చివరి వరకు మొత్తం రూ. 8.5 కోట్లు ఖర్చు అయింది’’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాతో వచ్చిన వార్తలకు చెక్ పడింది.