Big Stories

New electric scooter:-333 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

New electric scooter:-హైదరాబాద్‌కు చెందిన బ్రిస్క్ ఈవీ సంస్థ… భారతదేశంలోనే అతి ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఏకంగా 333 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈవీని లాంచ్ చేయబోతోంది. ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను… హైదరాబాద్ ఇ-మోటార్ షోలో వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రదర్శించింది… బ్రిస్క్ సంస్థ.

- Advertisement -

దేశ ఈవీ మార్కెట్లో ఇప్పటికే భారీ పోటీ నెలకొని ఉంది. ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో, ప్యూర్… ఇలా ఎన్నో సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే అవి ప్రయాణించే దూరం గరిష్టంగా 150 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్లు మాత్రమే. కానీ… ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా రెట్టింపు దూరం ప్రయాణించేలా ఆరిజిన్ ప్రో మోడల్‌ను రూపొందించింది… బ్రిస్క్ ఈవీ సంస్థ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే… ఆరిజిన్ ప్రో గరిష్టంగా 333 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతోంది.

- Advertisement -

ఆరిజిన్ ప్రో మోడల్‌లో రెండు బ్యాటరీలు అమర్చారు. ఒకటి 4.8 కిలోవాట్ల బ్యాటరీ కాగా, మరొకటి 2.1 కిలోవాట్ల బ్యాటరీ. ఇందులో 2.1 కిలోవాట్ల బ్యాటరీ మాత్రమే రిమూవబుల్ బ్యాటరీ. కేవలం 3.3 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఇక సబ్సిడీలు పోను దీని ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.4 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. మొబైల్ యాప్‌తో పాటు బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్ ఆరిజిన్ ప్రోలో ఉంది.

ఇక ఆరిజిన్ మోడల్‌లో మాత్రం బ్యాటరీ కెపాసిటీని తగ్గించారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 175 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఆరిజిన్ గరిష్ట వేగం 65 కిలోమీటర్లు. సబ్సిడీలు పోను దీని ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల మధ్య ఉండొచ్చని అంచనా. ఇందులో కూడా మొబైల్ యాప్‌తో పాటు బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. ఆరిజిన్, ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News