BigTV English

New Robotic Hand:- కొత్త రకమైన రోబోటిక్ హ్యాండ్.. చీకట్లో కూడా టాస్కులు..

New Robotic Hand:- కొత్త రకమైన రోబోటిక్ హ్యాండ్.. చీకట్లో కూడా టాస్కులు..

New Robotic Hand:- సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రోబోల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగినట్టుగా ప్రతీ రంగంలో వాటికి డిమాండ్ కూడా పెరుగుతూనే వస్తోంది. అందుకే శాస్త్రవేత్తలు సైతం రోబోల రకరకాలుగా ఎలా తయారు చేయాలి అనే విషయంపై రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే రోబోటిక్ హ్యాండ్, రోబో డాగ్ అనేవి మార్కెట్లో సంచలనం సృష్టించాయి. తాజాగా మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు సరికొత్త రోబో హ్యాండ్‌ను తయారు చేశారు.


ఇప్పటివరకు తయారైన రోబో హ్యాండ్స్ అనేవి టచ్ సెన్సార్లతో వస్తువులను గుర్తుపట్టడం లేక మనుషులు చెప్పింది పాటించడం చేస్తూ ఉండేవి. కానీ కొత్తగా తయారు చేసిన రోబో హ్యాండ్ అలాంటిది కాదని, చూస్తేనే వస్తువులను గుర్తుపట్టే అవసరం లేకుండా ఇందులో పలు అడ్వాన్స్ టెక్నాలజీలను జతచేర్చారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎప్పటినుండో శాస్త్రవేత్తలకు రోబోలకు తమకు తాముగా ఆలోచించే శక్తిని ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రయోగాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కొత్తగా తయారు చేసిన రోబోటిక్ హ్యాండ్‌కు మాత్రం తనకు తానుగా ఆలోచించే శక్తి ఉందని వారు బయటపెట్టారు.

ఎన్నో ఏళ్లుగా రోబోలకు ఆలోచించే శక్తిని ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఒకానొక సమయంలో వెనుదిరిగారు. కానీ ఇన్నాళ్లకు రోబటిక్ హ్యాండ్‌కు ఆ సామర్ధ్యాన్ని అందించి వారి కలలను నిజం చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న రోబోటిక్ హ్యాండ్స్ అనేవి ఒక వస్తువును ఒక చోటు నుండి ఇంకొక చోటికి చేర్చగలవు. కానీ వస్తువులను కలపడం, విడదీయడం వీటిని సాధ్యం కాదు. కొత్త రోబోటిక్ హ్యాండ్‌లో అలాంటి సామర్థ్యాలు కూడా జతచేర్చామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


కొత్తగా తయారైన రోబోటిక్ హ్యాండ్‌కు అయిదు వేళ్లు ఉంటాయి. దాంతో పాటు 15 జాయింట్స్ కూడా ఉంటాయి. ఈ అయిదు వేళ్లలోని ప్రతీ వేలుకు టచ్ సెన్సింగ్ టెక్నాలజీ జతచేర్చి ఉంది. ఇప్పటికే ఈ రోబోటిక్ హ్యాండ్‌తో పలు కీలకమైన పరీక్షలు చేసి చూశారు శాస్త్రవేత్తలు. అన్నింటిలో ఈ హ్యండ్ సక్సెస్‌ఫుల్‌గా టాస్కులను పూర్తి చేసింది. దీంతో ఈ రోబోటిక్ హ్యాండ్‌ను కనిపెడుతూ ఉండకపోయినా చెప్పిన టాస్కును పూర్తి చేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

వీటన్నింటితో పాటు ఈ రోబోటిక్ హ్యాండ్‌లో మరో కొత్త ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు శాస్త్రవేత్తలు. ఎలాంటి లైటింగ్ కండీషన్స్‌లో అయినా ఈ రోబోటిక్ హ్యాండ్ చెప్పిన టాస్క్‌ను పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తుందని బయటపెట్టారు. చీకట్లో కూడా దీని ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ రోబోటిక్ హ్యాండ్ తయారీ రోబోటిక్స్ రంగంలోనే కొత్త అధ్యాయానికి దారితీస్తుందని నమ్ముతున్నారు. త్వరలోనే ఈ రోబోటిక్ హ్యాండ్‌ను పలు ముఖ్యమైన టాస్కులను ఉపయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×