BigTV English

Congress: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన పక్షి.. గాల్లో ప్రాణం..

Congress: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన పక్షి.. గాల్లో ప్రాణం..

Congress: హెలికాప్టర్ ప్రమాదం అనగానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే గుర్తుకొస్తారు తెలుగు ప్రజలకు. దారుణమైన దుర్ఘటనలో వైఎస్సార్ చిద్రమయ్యారు. అప్పటి నుంచి.. హెలికాప్టర్ ఎక్కాలంటేనే భయపడుతున్నారు కొందరు నేతలు. కానీ, ఎన్నికల సమయంలో హెలికాప్టర్ వాడక తప్పని పరిస్థితి. తక్కువ టైమ్ ఉంటుంది.. ఎక్కువ సభలు ఉంటాయి. వేగంగా చుట్టేసి రావాలంటే.. గాల్లో ఎగరాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ప్రచార సభల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. లేటెస్ట్‌గా జరుగుతున్న కర్నాటక సంగ్రామంలోనూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. హెలికాప్టర్‌లోనే విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం కలకలం రేపింది.


ఎన్నికల ప్రచారం కోసం జక్కూరు నుంచి ముల్బాగల్‌కు వెళ్తున్నారు డీకే శివకుమార్‌. హెలికాప్టర్‌లోనే ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. వాళ్లు ఆ బిజీలో ఉండగా.. ఉన్నట్టుండి హెలికాప్టర్ కుదుపునకు లోనైంది. క్యాబిన్ అద్దం పగిలి.. గాలి లోనికి కొడుతోంది. హెలికాప్టర్ షేక్ అవుతోంది.

ఆ ఆకస్మిక పరిణామానికి డీకే శివకుమార్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందని పైలైట్‌ను అడిగితే.. పక్షి ఢీ కొట్టిందని చెప్పాడు. పక్షే కదాని లైట్ తీసుకోడానికి లేదు. గతంలో పలుమార్లు పక్షులు ఢీ కొట్టి పెద్ద పెద్ద విమానాలే డ్యామేజీ అయిన ఘటనలు ఉన్నాయి.


ఆకాశంలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో అంతా హైరానా పడ్డారు. కుదుపులకు హెలికాప్టర్‌లో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎక్స్‌పీరియన్స్ పైలైట్ కావడంతో హెలికాప్టర్‌ను నేర్పుగా హ్యాండిల్ చేశాడు. జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ.. అలా అలా ముందుకు తీసుకెళ్లి.. సమీపంలోని బెంగళూరు HAL విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశాడు. అంతా సేఫ్.

ప్రమాదంపై డీకే శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే ప్రమాదం జరిగిందన్నారు. కన్నడ ప్రజల ఆశీర్వాదం వల్ల తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైలట్‌ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడంతో సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు ట్వీట్ చేశారు డీకే శివకుమార్.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×