BigTV English

New Vaccine for Cancer : క్యాన్సర్‌కు కొత్త వ్యాక్సిన్.. మళ్లీ రాకుండా..

New Vaccine for Cancer  : క్యాన్సర్‌కు కొత్త వ్యాక్సిన్.. మళ్లీ రాకుండా..
Vaccine for Cancer


New Vaccine for Cancer : ప్రాణాంతక వ్యాధుల నుండి పేషెంట్లను రక్షించడం కోసం కేవలం ప్రభుత్వం తరపున పనిచేసే శాస్త్రవేత్తలు మాత్రమే కాదు.. ప్రైవేట్ సంస్థలు కూడా కష్టపడుతున్నాయి. కొత్త కొత్త ప్రయోగాలను చేయడంలో, పోటాపోటీగా వ్యాధులకు చికిత్సలను అందించడంలో ప్రైవేట్ సంస్థల మధ్య గట్టి పోటీనే నడుస్తోంది. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇది ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్స్ కంటే చాలా భిన్నమని అంటోంది.

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌కు చెందిన ట్రాన్స్‌జీన్ అనే కంపెనీ క్యాన్సర్‌కు కొత్త రకమైన వ్యాక్సిన్‌ను తయారు చేసి క్లినికల్ ట్రయల్స్‌ను కూడా పూర్తిచేసింది. మామూలుగా ఒక మనిషికి ఒకేసారి క్యాన్సర్ వస్తుందని గ్యారెంటీ లేదు. సర్జరీ ద్వారా క్యాన్సర్ నుండి బయటపడిన వారు కూడా మళ్లీ ట్యూమర్ పెరిగి క్యాన్సర్ బారినపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకసారి క్యాన్సర్ వచ్చి, అది తొలగించబడిన తర్వాత పేషెంట శరీరంలో మళ్లీ ట్యూమర్ పెరగకుండా ఉండేలా ట్రాన్స్‌జీన్ తయారు చేసిన వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ట్రాన్స్‌జీన్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇది మరికొందరి పేషెంట్లపై టెస్ట్ చేసినా కూడా రిజల్ట్స్ అనుకూలంగానే ఉంటాయని వారు నమ్ముతున్నారు. ఈ వ్యాక్సిన్‌కు టీజీ4050 అని పేరుపెట్టారు. ఇది ఒకసారి క్యాన్సర్ బారినుండి బయటపడి మరోసారి క్యాన్సర్ రిస్క్ ఉన్నవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసినది అని వారు బయటపెట్టారు. అలా ఒకసారి కాకుండా పలుమార్లు క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లు మళ్లీ మళ్లీ ఆ బాధను తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకుండా ఈ వ్యాక్సిన్ ఐడియాతో ముందుకొచ్చామన్నారు.

క్యాన్సర్ అనేది ప్రతీ ఒక్కరిపై ఒకేలా ప్రభావం చూపించదు. దానిని దృష్టిలో పెట్టుకునే ప్రతీ పేషెంట్‌కు ఉపయోగపడేలా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ కోసం 32 పేషెంట్లను వారు ఎంపిక చేశారు. వారిలో అందరికీ తలలో లేదా మెడపై ట్యూమర్ ఏర్పడినట్టుగా తెలిపారు. వారిలో కొందరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చి రిజల్ట్స్‌ను గమనించారు. ఈ రిజల్ట్స్‌ను బట్టి వారు తయారు చేసిన వ్యాక్సిన్ సక్సెస్ అయ్యిందని తేల్చారు. మిగతా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడతామని ట్రాన్స్‌జీన్ వెల్లడించింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×