BigTV English

New Year Resolutions : కొత్త ఏడాది నిర్ణయాలు కొనసాగాలంటే..!

New Year Resolutions : కొత్త ఏడాది నిర్ణయాలు కొనసాగాలంటే..!

New Year Resolutions : సరికొత్త ఆశలు, బోలెడన్ని ఆకాంక్షలను మోసుకొచ్చే నూతన సంవత్సరం గురించి తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పాత ఏడాది జీవితాన్ని ఓసారి వెనక్కి తిరిగి అవలోకించుకుని, కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతుంటాం. అయితే.. ఈ కొత్త ఏడాది నిర్ణయాలు తీసుకునేవారిలో కేవలం 42 శాతం మంది.. వాటిని రెండు వారాల్లోనే అటకెక్కిస్తున్నారని, వందలో నలుగురే వాటిని తు.చ తప్పక అమలు చేస్తున్నారనేది సైకాలజీ నిపుణులు చెబతున్న మాట. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది నిర్ణయాలు సరిగా అమలు కావాలంటే ఏం చేయాలో వారి మాటల్లోనే తెలుసుకుందాం. గట్టిగా అమలు చేసేందుకు ప్రయత్నిద్దాం.


ప్రపంచవ్యాప్తంగా తీసుకునే కొత్త ఏడాది నిర్ణయాల్లో.. రోజూ వర్కవుట్ చేయటం, స్మోకింగ్, డ్రింకింగ్ మానేయటం, డబ్బు పొదుపు, ఫ్యామిలీ టైం పెంచుకోవటం, మిత్రులతో కలిసి ట్రిప్పులు వేయటం, కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, బరువు తగ్గే ప్రయత్నం, కోపాన్ని జయించటం, రోజూ కాసేపైనా పుస్తకం చదవటం వంటివి ముందువరుసలో ఉంటాయి.

అయితే.. వీటిలో నిరుడు మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని అమలు చేశారు? మిగిలినవి ఎందుకు చేయలేకపోయారో నిజాయితీగా విశ్లేషించుకోవాలి. నిరుటి తప్పిదాలను ఈ ఏడాది చేయకూడదని గట్టిగా సంకల్పించుకోవాలి.


మీరు సాధించగలిగే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి. ఒకేసారి పదేసి నిర్ణయాలు తీసుకుని ఒకటీ అమలు చేయలేకపోవటం కంటే.. రెండేసి నిర్ణయాలే తీసుకుని వాటిని గట్టిగా అమలు చేసేందుకు ప్రయత్నించటం మంచి ఆలోచన.

మీరు తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలను… చిన్న చిన్న ముక్కలుగా చేసి, అమలు చేయాలి. ఉదాహరణకు.. కొత్త ఏడాదిలో లక్ష రూపాయలు పొదుపు చేయాలనుకుంటే.. తొలి రోజు నుంచే ఆరాటపడకుండా.. నెలకింత అని డిసైడ్ చేసుకుని పక్కనబెట్టుకుంటూ పోవచ్చు.

తీసుకున్న నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరించాలి. చీజ్, బట్టర్ లాంటివి తినకూడదు అనుకుని, ఏదో త్యాగం చేస్తున్నామని ఫీలవటం కంటే.. ‘ నా ఆరోగ్యం కోసం నేను దీనిని అమలు చేస్తున్నాను’ అనుకోవటం వల్ల సులభంగా మీ అలవాటు మార్చుకోగలుగుతారు.

మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఒక బోర్డు మీద రాసుకుని, రోజూ టిక్కులు పెట్టుకోవాలి. రోజూ వాటిని చూడటం, చదవటం వల్ల వాటిని సాధించాలనే సంకల్పం బలపడుతుంది.

మీరు తీసుకున్న నిర్ణయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. దీనివల్ల మధ్యలో మీరు మెత్తబడినా.. వాళ్లు మిమ్మల్ని ముందుకు సాగేలా ప్రోత్సహిస్తారు. అందరికీ తెలియటం వల్ల మీమీద కూడా కొంత సోషల్ ప్రెజర్ ఉంటుంది.

రోజూ ఇన్ని నీళ్లు తాగాలి, ఉదయాన్నే లేవాలి, యోగా క్లాసు మిస్ కావద్దు వంటి లక్ష్యాలున్నవారు మొబైల్స్‌లో రిమైండర్‌ పెట్టుకోవాలి. వారానికోసారి మన టార్గెట్ దిశగా అడుగులు పడుతున్నాయా? లేదా ఎక్కడైనా తడబడుతున్నామా? అని ఆలోచించుకోవాలి.

అనుకున్న పనిని ఒకరోజు పొరబాటున మిస్సయితే.. నిరాశ పడొద్దు. మర్నాడైనా సరే.. దానిని అమలు చేసేందుకు ప్రయత్నించండి. పదే పదే ప్రయత్నించైనా సరే.. మీరు అనుకున్న పనిని చేయండి తప్ప వదిలేయకండి. ప్రయత్నంలోనే విజయం ఉందని గుర్తించాలి.

ఇలా.. సైకాలజీ నిపుణుల చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించగలిగితే.. తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా అమలుచేయటం సాధ్యమవుతుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×