Nindu Noorella Saavasam Serial Today Episode : కోర్టులో లాయర్‌తో మాట్లాడుతున్న రణవీర్‌ను అమర్ పలకరిస్తాడు. హైదరాబాద్ ఎప్పుడొచ్చావని అడుగుతాడు. అమర్‌ను చూసిన రణవీర్ షాక్ అవుతాడు. అంతసేపు రణవీర్ పక్కనే ఉన్న మనోహరిని చిత్ర పక్కకు లాక్కెళ్తుంది. చిన్న పని ఉంటే ఉదయమే హైదరాబాద్ వచ్చాను అని చెప్తాడు. దీంతో రాథోడ్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సార్‌కు ఫోన్ చేసేవారు. ఇప్పుడు చేయలేదు అంటాడు. అది కోర్టులో చిన్న పని ఉంది అది అయ్యాక చేద్దామనుకున్నాను అని రణవీర్ చెప్పగానే.. నువ్వు ఉండేది కోల్‌కతాలో అయితే హైదరాబాద్ కోర్టులో ఏం పని నీకు ఏదైనా ప్రాబ్లమా రణవీర్ చెప్పు అని అడుగుతాడు అమర్. ప్రాబ్లమ్ ఏం లేదు అమరేంద్ర గారు ఫ్రెండు కేసు పని మీద వచ్చాను. ఫ్రెండు డివోర్స్ తీసుకుంటున్నాడు మోరల్ సపోర్టు కోసం వచ్చాను.. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు. అంజు పాప ఎలా ఉంది. అని అడుగుతాడు.
దీంతో అమర్ అందరూ బాగున్నారు నేను వేరే పని మీద వచ్చాను రణవీర్ కలుద్దాము అంటూ అమర్ వెళ్లిపోతాడు. పక్కనే డోర్ చాటున ఉన్న మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. రణవీర్ మనోహరి కోసం వెతుకుతాడు. మనోహరి పక్కనే చిత్ర ఉంటుంది. చిత్రను చూసిన మనోహరి షాక్ అవుతుంది. చిత్ర హాయ్ మనోహరి అని పలకరిస్తుంది. దీంతో మనోహరి కోపంగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. దీంతో చిత్ర ఏంటి మను కాపాడినందుకు థాంక్స్ లేదు. తప్పించినందుకు అప్రిసియేషన్ లేదు అంటుంది. దీంతో మనోహరి థాంక్స్ నువ్వు నన్ను పక్కకు లాగకుండా ఉండి ఉంటే.. అని చెప్పబోతుంటే అమరేంద్ర గారిని పెళ్లి చేసుకోవాలనుకున్న నీ కల కలగానే మిగిలిపోయేది అంతే కదా..? అయినా నువ్వు దొరికిపోతే నాకు వచ్చే లాభం ఏంటో చెప్పు.. అదే నిన్ను తప్పిస్తే.. నాకు కావాల్సినప్పుడు నాకు కావాల్సినంత డబ్బు ఇస్తావు కదా అంటుంది.
దీంతో మనోహరి అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది. అసలు ఎందుకో తెలియనట్టు అడుగుతావు ఏంటి..? ఆశ్రమం నుంచి వెళ్లినప్పుడు కొంచెం టచ్‌లో ఉండమని చెప్పాను కదా.. కానీ నువ్వు లేవు. అందుకే నేను ఉందామని మీ ఇంటికి వస్తే.. నువ్వు కంగారు పడుతూ బయటకు వెళ్తూ కనిపించావు. ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చాను. కలిసి వెళ్దాం అనుకుంటే నాకు కలిసి వచ్చే విషయం ఒకటి తెలిసింది అని చిత్ర అంటుండగానే.. రణవీర్ వచ్చి తనను పక్కకు తీసుకొచ్చింది మీరేనా అని అడుగుతాడు. అవునని చిత్ర చెప్పగానే రణవీర్ థాంక్స్ చెప్తాడు. తర్వాత మనోహరి డివోర్స్ ఫ్రోగ్రాం మరో రోజు పెట్టుకుందామని అంటుంది. అలాగైతే నేను డైరెక్టుగా అమరేంద్ర దగ్గరకు వెళ్లి నిజం చెప్తాను అంటాడు. దీంతో మనోహరి షాక్ అవుతుంది.
ఆకాష్, అంజు చెస్ ఆడుతుంటారు. అందరూ చూస్తుంటారు. చెస్ చాంపియన్ అయిన ఆకాష్‌ను అంజు ఓడిస్తుంది. దీంతో అంజు గంతులు వేస్తుంది. దీంతో శివరాం.. అబ్బా దెబ్బ మీద దెబ్బ ఏయ్ ఆకాష్ లేరా.. ఏయ్ పొట్టి రావే చూసుకుందాం అంటాడు. నిర్మల మాత్రం పిల్లలతో ఎందుకండి ఆటలు అంటుంది. అనామిక కూడా అంకుల్ చూసుకోండి మరి అంజలితో ఓడిపోతే బాగోదు అంటుంది. ఈ కాన్ఫిడెంట్ తగ్గించడానికేనమ్మా నేను రంగంలోకి దిగేది అంటాడు శివరాం. దీంతో అంజు హలో మిస్టర్ శివం నేను గెలిస్తే వన్ వీక్ నా అసైన్ మెంట్స్ అన్ని నువ్వే రాయాలి అంటుంది. శివరాం ముందు గెలవవే అప్పుడు చూసుకుందాం.. నేను గెలిస్తే పనిష్‌మెంట్ పీక్‌లో ఉంటుంది. ఓరేయ్ ఆకాష్ లేవరా.. అంటూ శివరాం, అంజు చెస్ ఆడుతారు.
అంజు ఓడిపోయే టైంలో అనామిక హెల్ప్ చేసి గెలిపిస్తుంది. అచ్చం ఆరులా గేమ్ ఓవర్ యువర్ ఫినిష్ అంటుంది. ఆ మాటలకు శివరాం, నిర్మల షాక్ అవుతారు. తర్వాత గార్డెన్‌లోకి వెళ్లిన అనామిక వెనకాల వెళ్తారు. శివరాం అమ్మా అనామిక నువ్వు ఎవరు..? నీకు మా కోడలు అరుంధతికి సంబంధం ఏంటి..? చెప్పమ్మా మా కోడలు నీకు తెలుసా..? పరిచయం ఉందా నీకు అని అడుగుతాడు. దీంతో అనామిక షాక్ అవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంకుల్ అంటుంది. ఇందాకా చెస్ గేమ్‌లో అంజును గెలిపించాక నువ్వు ఏమన్నావో గుర్తు ఉందా అమ్మా అంటాడు శివరాం. గేమ్ ఓవర్ యువర్ ఫినిష్ అన్న మాటలు అనామిక గుర్తు చేసుకుంటుంది. పిల్లలు కూడా అంటుంటారు అప్పుడప్పుడు నువ్వు అరుంధతిలా ప్రవర్తిస్తుంటావని.. చనిపోయిన మా కోడలి లాగా నువ్వు ఎలాగా మాట్లాడగలుగుతున్నావమ్మ చెప్పు అంటూ ప్రశ్నించడంతో అనామిక మౌనంగా ఉండిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?