Savings Account: ప్రస్తుత రోజుల్లో బ్యాంకు ఖాతా లేకుండా జీవితం సాగించడం అంటే మొబైల్ లేకుండా బయటకి వెళ్లినట్లే. ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా లేదా ఒక సాధారణ వ్యక్తైనా అందరికి కనీసం ఒక్క సేవింగ్ ఖతా (Savings Account) అయినా ఉంటుంది. కానీ ఈ ఖాతాలో మనం ఎంత కావాలంటే అంత డబ్బు పెట్టుకోలేం అన్న సంగతి చాలామందికి తెలియదు. పెద్ద మొత్తంలో నగదు ఉంచితే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.
10 లక్షలపైన డబ్బు ఉంటే..
వీటి విషయంలో RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఆదాయపు పన్ను శాఖలు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి పొదుపు ఖాతాలో రూ.10 లక్షల వరకు నగదును ఉంచుకోవచ్చు. కానీ ఈ పరిమితి దాటితే ఏంటి అనే ప్రశ్నలు చాలా మందికి ఎదురవుతాయి. ఒక వ్యక్తి పొదుపు ఖాతాలో పది లక్షలకు మించిన మొత్తాన్ని ఉంచితే, అది సాధారణ డిపాజిట్‌గా కాకుండా, డౌట్‌ఫుల్ డిపాజిట్‌గా పరిగణించబడుతుంది. ఇది తక్షణమే ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలా జరిగితే, మీరు ఎక్కడి నుంచి ఆ డబ్బు పొందారని అడుగుతారు.
సేవింగ్ ఖాతా అంటే ఏంటి?
నగదును సురక్షితంగా నిల్వ చేసుకోవాలంటే, బ్యాంక్ సేవింగ్ ఖాతా ఒక అద్భుతమైన ఛాయిస్. ఇది కేవలం డబ్బు భద్రపరచే ప్రదేశమే కాదు. కొన్ని బ్యాంకులు ఈ ఖాతాలపై తక్కువ శాతం వడ్డీని కూడా అందిస్తున్నాయి. అదొక్కటే కాదు, డిజిటల్ లావాదేవీల కోసం, బిల్లు చెల్లింపులు, షాపింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.
AIR అంటే ఏంటి?
మీరు బ్యాంక్‌లో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారా? అప్పుడు మీ లావాదేవీ AIR (Annual Information Return) అనే రిపోర్టులో నమోదయ్యే అవకాశం ఉంది. ఈ AIR అనేది బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి సమర్పించే ఒక కీలక డాక్యుమెంట్. ఇందులో ఖాతాదారులు చేసిన భారీ విలువ గల డిపాజిట్లు, ఖర్చులు, ఇతర ముఖ్యమైన లావాదేవీల సమాచారం ఉంటాయి. ఉదాహరణకి, మీరు సేవింగ్ ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే అది AIRలో చేర్చబడుతుంది. దీన్ని చూస్తే “ఇంకమ్ ట్యాక్స్ తప్పనిసరి” అన్న అర్థం మాత్రం కాదు. కానీ మీ ఆదాయం ఎంత? మీరు వేసిన డిపాజిట్ తగినదేనా? అనే దానిపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఆరా తీస్తుంది.
Read Also: WhatsApp Update: వాట్సాప్ వాడుతున్నారా? కేంద్రం కీలక …
కరెంట్ ఖాతా కలవారికి మరో లిమిట్
కేవలం పొదుపు ఖాతా మాత్రమే కాదు, కరెంట్ అకౌంట్ (Current Account) లో కూడా పరిమితి ఉంది. మీరు రూ.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, అదే AIR రిపోర్ట్‌లో నోట్ అవుతుంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించే కరెంట్ ఖాతాలు దీనికి లోబడి ఉంటాయి.
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలంటే PAN తప్పనిసరి
మీరు ఒక్కసారి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే, వెంటనే పాన్ కార్డు (PAN Card) వివరాలు ఇవ్వాలి. అంతేకాదు, ఒకే సంవత్సరంలో మీరు వరుసగా పెద్ద మొత్తాలు డిపాజిట్ చేస్తుంటే, మళ్లీ పాన్ అవసరం అవుతుంది. బ్యాంకులు ఇప్పటివరకు “కెవైసీ” (KYC) ప్రక్రియ ద్వారా ఈ వివరాలు అడుగుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు లావాదేవీలు పెంచుకుంటే, ఆ వివరాలను ప్రభుత్వ విభాగాలకూ షేర్ చేయాల్సి ఉంటుంది.
పొదుపు ఖాతా vs ఫిక్స్‌డ్ డిపాజిట్: ఏది మంచిది?
మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే, అది పొదుపు ఖాతాలో ఉంచడం కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)గా మార్చడం ఉత్తమం. ఎందుకంటే FDలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. పొదుపు ఖాతాలో పరిమితి ఉన్నా, FDల విషయంలో ఎక్కువ ఆంక్షలు ఉండవు. కొన్ని FDలు పన్ను మినహాయింపుకు కూడా అర్హత కలిగి ఉంటాయి.
స్మార్ట్ మౌవ్ – స్వీప్ ఇన్ ఫెసిలిటీ
కొన్ని బ్యాంకులు మీ పొదుపు ఖాతాలో ఉన్న అదనపు డబ్బును ఆటోమేటిక్‌గా FD గా మార్చే “Sweep-in Facility” అందిస్తున్నాయి. ఇలా చేస్తే, మీ డబ్బు ఖాళీగా ఉండకుండా FD రూపంలో వడ్డీ తెస్తుంది. మీకు అవసరమైనప్పుడు మళ్లీ అదే డబ్బును వాడుకోవచ్చు. ఇది ప్రత్యేకించి పెద్ద మొత్తాల్లో నగదు ఉంచేవారికి మంచి ఎంపిక.