E-Paper
Advertisement

Horoscope Today April 12th : ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు –  నిరుద్యోగులకు శుభవార్తలు  

Horoscope Today April 12th : ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు –  నిరుద్యోగులకు శుభవార్తలు  

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 12న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: మొండి బాకీలు స్నేహితుల నుండి వసూలు అవుతాయి. అవసరానికి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మిధునం: దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.

సింహం: రావలసిన ధనం సమయానికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.

కన్య: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం: స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి.

ధనస్సు: సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.

మకరం: దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.

కుంభం: సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

మీనం: సమాజంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×