Nindu Noorella Saavasam Serial Today Episode : ఘోర నవ్వుతూ మనం అనుకున్న వెంటనే జరగడానికి ఇదేం అల్లా ఉద్దీన్ అద్బుత దీపం కాదు మనోహరి.. నేను ఇంకా కొన్ని శక్తులు సంపాదించుకోవాలి అని చెప్తాడు. దీంతో షాక్ అయిన మనోహరి అంటే ఈ శక్తులు నీకు సరిపోవా..? అని డౌటుగా అడుగుతుంది. దీంతో ఘోర కొంచెం టైం పడుతుంది అని చెప్పగానే నేను నిన్ను నమ్ముకుని నా టైం వేస్ట్ చేసుకున్నాను. నీకు సాయం చేసి నువ్వు నాకు సాయం చేస్తావని నేను చాలా తప్పు చేశాను. ఇక నీకు నాకు ఏ సంబధం లేదు అని మనోహరి వెళ్లిపోతుంటే.. ఘోర ఆపుతాడు. మనోహరి నేను చెప్పేది విను అంటాడు.
అయినా మనోహరి వినకుండా నేను మోసపోయింది చాలు ఘెర. తప్పుకో నేను వెళ్లాలి. శక్తులు రావడం.. కోరుకున్నది జరగడం అన్నీ మాటలు మాత్రమే.. అనగానే ఉత్తి మాటలు కాదని నిరూపిస్తే.. నీ కర్తవ్యం నీవు నిర్వహిస్తావా? మనోహరి అని అడుగుతాడు ఘోర. ముందు నిరూపించు. ఆ తర్వాత నేను నిర్వర్తిస్తా.. అంటుంది మనోహరి. దీంతో సాసీను చేతిలోకి తీసుకుని మంత్రాలు చదివి ఓపెన్ చేసి ఎదురుగా వస్తున్న ఆవిడను ఆవహించు అనగానే ఆరు ఆత్మ వెళ్లి ఆవిడను ఆవహిస్తుంది. ఘోర చెప్పినట్టుగానే చేస్తుంది. కారుకు ఎదురు వెళ్లు అనగానే ఆవిడ పరుగెత్తుకుంటూ కారుకు ఎదురు వెళ్తుంది. అది చూసిన మనోహరి షాక్ అవుతుంది. ఆగమని చెప్పు ఘోర లేదంటే ఆవిడను చంపిన నేరం మన మీద పడుతుంది అంటూ అరుస్తుంది.
ఘోర పక్కకు తప్పుకో అనగానే ఆవిడ ( ఆరు ఆత్మ) పక్కకు తప్పుకుంటుంది. మళ్లీ వెళ్లి యధా స్థానంలో నిలబడు అని చెప్పగానే అలాగే వెళ్లుంది. ఏవేవో మంత్రాలు చదవగానే ఆరు ఆత్మ వచ్చి సీసాలో బంధీ అవుతుంది. తెలియకుండా కూడా చీమకైనా అపకారం చేయని ఆరు.. ఒక వ్యక్తి చావుకు కారణం కాబోయింది అంటే నమ్మలేకపోతున్నాను అంటుంది మనోహరి. చూశావు కదా మనోహరి నా మాట నా మంత్రం. ఏదీ అబద్దం కాదు. ఇలాంటి మనోహన్నతమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ శక్తి కావాలి అని ఘెర చెప్పగానే సరే ఇందాక ఏదో సాయం అన్నావు. ఏం కావాలి అని అడుగుతుంది మనోహరి. ఏం లేదు మనోహరి.. ఆ అమ్మాయి దీక్ష విరమించేలా చేయాలి. మానవుడికి మాధవుడు తోడైతే అప్పుడు మన కష్టం అంతా వృథా అవుతుంది అని ఘోర చెప్పగానే సరే అని వెళ్లిపోతుంది మనోహరి.
గార్డెన్‌లో ఆలోచిస్తూ ఉన్న గుప్త మిస్సమ్మ దీక్ష పూర్తి చేసేలా చూడమని ఏ ఆంటంకం రాకూడని దేవుడిని ప్రార్థిస్తాడు. మరోవైపు లోపల అమ్మవారి ముందు నిలబడ్డ మిస్సమ్మ షాకింగ్ గా చూస్తూ.. అత్తయ్యా అంటూ కేకలు వేస్తుంది. లోపలి నుంచి నిర్మల, శివరాం పరుగెత్తుకుంటూ వచ్చి ఏమైందని అడుగుతారు. మిస్సమ్మ గుమ్మం వైపు చూపిస్తుంది. అక్కడ పిల్లలు కూడా దీక్ష వేసుకుని వచ్చి నిలబడి ఉంటారు. పిల్లలను చూసిన గుప్త కూడా ఆశ్యర్యపోతాడు. ఏంటిది నేను చూచుతున్నది నిజమా.. కలయా..? అనుకుంటాడు. మిస్సమ్మ కూడా పిల్లలూ ఏంటిదంతా మీరు.. అంటూ ఏదో అడగబోతుంటే…
మేం కూడా నీలాగే అమ్మవారి దీక్ష చేస్తున్నాము మిస్సమ్మ అని అమ్ము చెప్తుంది. దీంతో దీక్ష అంటే పట్టింపులు, సంప్రదాయాలు ఉంటాయి నాన్నా.. పైగా రోజంతా ఉపవాసం కూడా ఉండాలి అని చెప్తుంది నిర్మల. పర్వాలేదు నాన్నమ్మా అన్ని తెలుసుకునే దీక్ష చేయాలనుకున్నాం అంటుంది అంజు. ఇంతకీ మీరెందుకు దీక్ష చేయాలనుకుంటున్నారు అని శివరాం అడుగుతాడు. ఎందుకో తెలియడం లేదు కానీ అంజు బర్తుడే నుంచి ఏదో బాధ తాతయ్యా కారణం తెలియడం లేదు. మిస్సమ్మ కూడా అలానే అనుకుని వేసుకుంది కదా? మేము కూడా మంచి జరుగుతుందని వేసుకున్నాం అని పిల్లలు చెప్తారు.
శివరాం మంచి జరగాలని మీరనుకుంటున్నారు. కానీ మీ నాన్నకు ఇవన్నీ పట్టవు కదా? ఏంత గొడవ చేస్తాడో ఏంటో..? అని భయపడుతుంటే రాథోడ్ వచ్చి మీరు మాట్లాడుతుంది మా సారు గురించేనా సార్ అంటూ పక్కకు జరగ్గానే రాథోడ్ వెనక నుంచి దీక్ష వేసుకున్న అమర్ వస్తాడు. దీక్షలో అమర్‌ను చూడగానే అందరూ షాక్ అవుతారు. హ్యాపీగా ఫీలవుతారు. మిస్సమ్మ నువ్వు ఏ ముహూర్తాన దీక్ష చేపట్టావో తెలియదు కానీ ఇంట్లో మంచి మార్పులు మొదలైనట్టే అంటుంది నిర్మల. ఇంతలో అమర్, మిస్సమ్మ ఈ దీక్ష ఎలా చేయాలో ఎం చేయాలో నువ్వే చెప్పు అని అడగ్గానే దీక్ష నిమయాలు చెప్తుంది మిస్సమ్మ. అప్పుడే అక్కడికి రామ్మూర్తి వచ్చి అమర్ కు థాంక్స్ చెప్తాడు. అందరూ కలిసి పూజ చేస్తుంటారు.
మిస్సమ్మ దీక్ష చెడగొట్టాలని ఇంటికి వస్తుంది మనోహరి. బయట కారు దిగగానే రాథోడ్ ఎదురవుతాడు. దీంతో ఫస్ట్ రాథోడ్ ను కన్వీన్స్ చేయాలనుకుని.. రాథోడ్ ఇంట్లో పూజలు అంటే అమర్ కు పడదు కదా. అందుకే మిస్సమ్మను దీక్ష అయ్యే వరకు ఏదైనా గుడిలో ఉండమని చెప్పుకూడదా అంటుంది. రాథోడ్ నవ్వుతూ సూపర్ ఐడియా మేడం ఇదే ఐడియా వెళ్లి ఇంట్లో చెప్పండి అనగానే హ్యాపీగా మనోహరి లోపలికి వెళ్తూ.. వీడే ఐడియా బాగుంది అన్నాడంటే దాని దీక్షను భగ్నం చేయడం పెద్ద కష్టం కాదు అనుకుంటూ.. లోపలికి వెళ్లి అందరూ దీక్ష లో పూజ చేస్తుండటం చూసి షాక్ అవుతుంది మనోహరి.
వెంటనే తేరుకుని అమర్ ఏంటిదంతా ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. దీంతో కూల్ గా అమర్ దీక్ష చేస్తున్నాము అని చెప్పగానే నువ్వు మాల వేసుకుని దీక్ష చేయడం ఏంటి అమర్ అని మనోహరి అడగ్గానే ఏం మనోహరి గారు వాళ్లు దీక్ష చేయకూడదా? చేస్తే ఎవరికైనా నష్టమా..? అంటూ మిస్సమ్మ అడుగుతుంది. దీంతో మనసులో మిస్సమ్మను తిట్టుకున్న మనోహరి మీరు బలవంతంగా అమర్ చేత దీక్ష చేయిస్తున్నారేమో అంటుంది. దీంతో అదేం లేదు మనోహరి నేనే దీక్ష తీసుకున్నాను అని అమర్ చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.