trinayani serial today Episode: త్రినేత్రి, ముక్కోటి కాళ్లు చేతులు కడుక్కుని భోజనానికి వస్తారు. ముక్కోటి భార్య వచ్చి త్రినేత్రికి భోజనం వడ్డిస్తుంది. ముక్కోటి తన భార్యను పక్కకు పిలిచి అన్నంలో విషం కలిపావా? అని అడుగుతాడు. ఎందుకని అడుగుతుంది ఆయన భార్య. దీంతో అన్నంలో విషం పెట్టి త్రినేత్రిని చంపేద్దాం అనుకున్నాం కదా? అంటాడు. దీంతో అమ్మో నా వల్ల కాదు అని భయపడుతుంది. త్రినేత్రి ఒంటిపై ఉన్న నగలు నీ ఒంటిపైకి రావాలని లేదా? అంటాడు. త్రినేత్రి భోజనం చేస్తుంది.
విక్రాంత్ పని చేసుకుంటుంటే.. సుమన కోపంగా ఈ ఇంట్లో తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి పడుతుంది అని అరుస్తూ వస్తుంది. అన్నం ఒకరు తిని ఇంకొకరు అరాయించుకోవాలి అంటే ఎలా అవుతుంది అని అరుస్తుంది. దీంతో విక్రాంత్ కోపంగా ఆపమని చెప్తాడు. అయినా వినకుండా సుమన అరుస్తూనే ఉంటుంది. దీంతో తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అంటాడు. చేసింది మీ అన్నయ్య కాదు మీ పెద్ద వదిన. జ్యూస్‌లో విషం కలుపుకుని వచ్చి అందరికీ ఇచ్చింది అంటూ బాధపడుతుంది.
పెద్ద వదిన ఎప్పుడూ నయని వదిన విషయంలో ఎప్పుడూ తప్పు చేయదని చెప్తాడు విక్రాంత్. మా అమ్మ గురించి.. మా బ్రో గురించి కన్న కొడుకుగా ఒక తమ్ముడిగా వాళ్ల గురించి నేను చెప్పగలను. పేపర్ ముక్కతో కూడా గొంతు కోయగలరు వాళ్లు అంటాడు విక్రాంత్. దీంతో బాగా చెప్పారు అంటుంది సుమన. దీంతో నాతో కాకుండా మా అమ్మను నిలదీయాల్సింది. మా అక్కను ఎందుకు చంపాలనుకున్నారు అని. విక్రాంత్ చెప్పగానే వాళ్లు ఎందుకు అలా చేస్తారు. నీకు అన్ని అనుమానాలే.. పాపం మంచి వాల్లు వాళ్లు అంటూ వెళ్లిపోతుంది.
హాల్లో అటూ ఇటూ తిరుగుతున్న సుమనను వల్లభ చిన్న మరదలా.. నువ్వెందుకు ఇంకా సన్నబడిపోవాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. తనేం ఉపవాసం లేదు కదరా? అంటూ తిలొత్తమ్మ అడగ్గానే తినకపోతేనే తగ్గరు మమ్మీ ఇలా అటూఇటూ తిరిగితే కూడా క్యాలరీస్ తగ్గిపోయి ఇంకా సన్నబడిపోతుందని నా బాధ అని చెప్తాడు వల్లభ. దీంతో చిట్టి గురించి తెగ బాధపడిపోతున్నారే అంటుంది హాసిని.. విక్రాంత్ మాత్రం సుమనను తిరగడం ఆపమని చెప్తాడు. నిన్ను చూస్తేంటే మా తల తిరుగుతుంది అంటాడు.
నేను గాయత్రి అత్తయ్య గురించి ఆలోచిస్తున్నానండి అని చెప్తుంది సుమన. ఈ ఇంట్లో మనకు కనిపించక ముందు గేటు దగ్గరో గుమ్మం బయటో చిన్న పిల్లగా ఉండి ఆత్మగా మారి మన దగ్గరకు వస్తుందా? లేకపోతే శీమతి గాయత్రిదేవిగా వస్తుందా? అని ఆలోచిస్తున్నాను అంటుంది సుమన. ఇంతలో విశాల్ వచ్చి ఏంటి తెగ తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. ఈరోజు టాఫిక్ మీ అమ్మ గురించే నాన్నా అని చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో నయని.. అమ్మగారు ఇవాళ తన జాడ గురించి చెప్తా అన్నారు కదా బాబుగారు అంటుంది. అందుకే మీరు రాక ముందు నుంచి మేమంతా ఇక్కడే ఎదురుచూస్తున్నాం అంటుంది సుమన. ఇంతలో గాయత్రిదేవి వస్తుందని నయని చెప్తుంది. అందరూ షాకింగ్ గా ఎక్కడున్నారు అని అడుగుతారు.
అదిగో అక్కడ అని నయని కదిలే బొమ్మను చూపిస్తుంది. గాయత్రిదేవి బొమ్మను పట్టుకుని వస్తుంటుంది. దీంతో హాసిని భయంగా అత్తయ్య ఎక్కడుంది. బొమ్మ వస్తుంది కదా అంటుంది. ఇంతలో నయని అమ్మ ఇక్కడే ఉందా? అని విశాల్ అడుగుతాడు. బొమ్మ ఉందంటే అమ్మ ఉన్నట్టే విశాల్ అని చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో విశాల్ అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు ఉండగా మాకు భయమేం ఉంటుంది. నిన్ను పసిపాపగా ఎప్పుడైనా చూడగలుగుతాం అంటాడు. దీంతో ఏంటి బావగారు మీరు మాట్లాడేది ఇప్పుడు పసిపాప ఎక్కడుందో చెప్పకూడదు అని అంటునావా? అంటూ సుమన ప్రశ్నిస్తుంది.
అమ్మగారు నాకు తెలియకుండా ఉండటమే మంచిది అనుకుంటే మీరు చెప్పకపోయినా నేను ఏం అనుకునేదాన్ని కాదు. కానీ నా గ్రహబలం సరిగ్గా లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకని అడిగాను. ఒక్కసారి నా పెద్ద కూతురుని ఒక్కసారి చూసుకున్నాక ఆ తర్వాత ఏం జరిగినా సరే అంటూ ఏడుస్తుంది నయని. దీంతో కన్నతల్లి కాబట్టి అంత బాధ ఉంటుంది అక్క. నువ్వు కూడా విశాల్ ను కన్నావు అంటుంది తిలొత్తమ్మ. దీంతో మరి నీకెందుకు కన్న ప్రేమ లేకుండా పోయిందని ప్రశ్నిస్తుంది గాయత్రిదేవి. నా కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఎందుకు చంపాలని చూస్తున్నావు అంటుంది. దీంతో తిలొత్తమ్మ షాక్ అవుతుంది.
నయని కూడా అది నిజమే కదా అత్తయ్యా అంటుంది. ఇంతలో గాయత్రి దేవి తన చేతిలోని బొమ్మను నయనికి ఇచ్చి అహల్యకు ఫోన్ చేసి ఈ బొమ్మ నీ దగ్గర ఉందని చెప్పు అంటుంది. దీంతో అహల్య గాయత్రి పాపను వెంటబెట్టుకుని బొమ్మను తీసుకుని రేపు పరమేశ్వరి గుడి దగ్గరకు రమ్మని చెప్తుంది. నీకు అక్కడ నేను పసిపాపగా ఎలా ఉన్నానో తెలిసిపోతుంది నయని అని చెప్పగానే నయని సంతోసంగా ఫీలవుతుంది. అయితే పునర్జన్మ ఎత్తిన నాకు రేపు ప్రాణగండం రావొచ్చు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది గాయత్రిదేవి. తిలొత్తమ్మ అందరికీ గాయత్రిదేవి చెప్పిన విషయాలు మొత్తం చెప్తుంది. రేపే ఆవిడకు ప్రాణగండం కూడా ఉందట అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.