BigTV English

Nokia X30 5G:బాబోయ్.. అంత ధర పెడితే కొంటారా?

Nokia X30 5G:బాబోయ్.. అంత ధర పెడితే కొంటారా?

Nokia X30 5G:నోకియా బ్రాండ్ ఫోన్లు అంటే ఇష్టపడే వారికి షాకిచ్చింది… హెచ్ఎండీ గ్లోబల్. X30 పేరుతో లాంచ్ చేసిన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌కు భారీ ధర నిర్ణయించింది. దాంతో, అదే ధరకు అవే స్పెసిఫికేషన్స్ ఉన్న రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లు వస్తాయని హెచ్ఎండీ గ్లోబల్ మీద సెటైర్లు వేస్తున్నారు… వినియోగదారులు.


ఒకప్పుడు మన దేశంలో ఫోన్ అంటే నోకియానే. ఆ స్థాయిలో వినియోగదారుల ఆదరణ పొందిన నోకియా… కాలానికి తగ్గట్టుగా వచ్చిన మార్పుల్ని అందిపుచ్చుకోలేక మూతపడింది. ఆ తర్వాత హెచ్‌ఎండీ గ్లోబల్ అనే సంస్థ నోకియా పేరుతో స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పుడు X30 పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేసిన నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌ రేటు విని… అంతా షాకయ్యారు.

6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో లాంచ్ అయిన నోకియా X30 5G స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 50+13 మెగా పిక్సెల్ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఓవైపు మార్కెట్లోకి ఆండ్రాయిడ్ 13 స్మార్ట్‌ఫోన్‌లు వస్తుంటే… ఆండ్రాయిడ్ 12తో తీసుకొచ్చిన X30 ధరను… రూ.48,999గా నిర్ణయించింది… హెచ్ఎండీ గ్లోబల్. దాంతో… ఈ ధరలో దాదాపు ఇవే స్పెసిఫికేషన్స్ ఉన్న ఇతర బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు రెండు వస్తాయంటున్నారు… వినియోగదారులు. వన్ ప్లస్, షావోమి, రియల్ మి, శాంసంగ్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు X30 కంటే బెటర్ ఫీచర్లతో తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయంటున్నారు.


నోకియా X30 5G స్మార్ట్‌ఫోన్‌కు భారీ ధర నిర్ణయించిన హెచ్ఎండీ గ్లోబల్… గుడ్డిలో మెల్ల అన్నట్లు కొన్ని ఆఫర్లు ప్రకటించింది. ఈ ఫోన్‌ను నోకియా వెబ్‌సైట్‌లో కొంటే రూ.1,000 తగ్గింపు ఇవ్వడంతో పాటు రూ.2,799 విలువైన నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్, రూ.2,999 విలువైన 33 వాట్స్‌ ఛార్జర్ ఉచితంగా ఇస్తామని తెలిపింది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 20 నుంచి X30 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇక ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ చేసి X30 5G స్మార్ట్‌ఫోన్‌ కొంటే… అదనంగా రూ. 4000 డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. అయితే… భారీ రేటు, స్వల్ప ఆఫర్లు ఉన్న నోకియా X30 5G స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారుల నుంచి ఏ మాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×