OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో వస్తున్న సినిమాలు, మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈమధ్య బెంగాల్ సినిమాలు కూడా మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తోంది. లావుగా ఉండే మనుషులు, సమాజంలో ఎదుర్కొనే సమస్యలతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఇందులో హీరోయిన్ ఈ సమస్యను అధిగమించి ఆడవాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సోనీ లీవ్ (Sony LIV) లో
ఈ బెంగాలీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘ఫటాఫతి‘ (Fatafati). 2023 లో వచ్చిన ఈ బెంగాలీ మూవీకి అరిత్ర ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విండోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ నిర్మించారు. ఈ మూవీలో రీతాభరి చక్రవర్తి, అబిర్ ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. సమాజంలో జరిగే బాడీ షేమింగ్ చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో, హీరోయిన్ భార్యాభర్తలుగా తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. ఒక గార్మెంట్ షాప్ లో పనిచేసే హీరోకి తల్లితో పాటు ఒక తమ్ముడు ఉంటాడు. భర్త సంపాదనకి తోడుగా హీరోయిన్ కూడా ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ లావుగా ఉండటంతో అందరూ ఆమెను ఎగతాళి చేస్తుంటారు. ముఖ్యంగా అత్తగారైతే విపరీతంగా ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇలా సాగిపోతున్న క్రమంలో భర్త చేస్తున్న కంపెనీ నష్టాల్లో ఉండటంతో, ఉద్యోగం పోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ తను డిజైన్ చేసే డ్రెస్లను ఇంస్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది. లావుగా ఉండేవాళ్లు వేసుకునే డ్రెస్ ను హీరోయిన్ చాలా అందంగా కుట్టడంతో, ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫేమస్ అయిపోతుంది. అలా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తుంది. భర్తకి ఒకరోజు ఉద్యోగం పోతుంది. భర్తకి ఖర్చులకోసం పర్సులో డబ్బులు పెట్టడంతో, భర్త చాలా బాధపడతాడు. భార్య మీద కోపంతో కొద్దిరోజులు మాట్లాడటం మానేస్తాడు.
హీరో మరో ఉద్యోగం వెతుక్కుని, ఇంటర్వ్యూకు సిటీకి వెళ్తాడు. ఒక ఫ్యాషన్ డిజైన్ కంపెనీలో ఇతనికి ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేయాలనుకుని, అందులో భాగంగా హీరోయిన్ కి ఇన్విటేషన్ కూడా పంపిస్తారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ అవడంతో, కంపెనీకి తన వల్ల ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు. అయితే ఇప్పటివరకు ఆమె ఫేస్ పూర్తిగా కనపడకుండానే, ఇన్స్టాల్ లో ఫేమస్ అవుతుంది. ఆమెను చూసిన కొంతమంది తను ఫ్యాషన్ షోకు పనికిరాదని ఎగతాళి చేస్తారు. వాళ్లందర్నీ అధిగమించి, ఆ ఫ్యాషన్ షో లో హాట్ గా కనిపిస్తుంది హీరోయిన్. భర్త కూడా తన భార్యను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. మీరు కూడా ఈ మూవీ ని చూడాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ (Sony LIV) లో సిద్ధంగా ఉంది. మరి ఎందుకు ఆలస్యం ఈ మూవీపై ఓలుక్కేయండి.