BigTV English

Oldest DNA reveals Greenland life 2 million years ago : గ్రీన్ లాండ్ లో బయటపడిన 20 లక్షల ఏళ్లనాటి అత్యంత పురాతన డీఎన్ఏ

Oldest DNA reveals Greenland life 2 million years ago : గ్రీన్ లాండ్ లో బయటపడిన 20 లక్షల ఏళ్లనాటి అత్యంత పురాతన డీఎన్ఏ

Oldest DNA reveals Greenland life 2 million years ago : జీవం ఎప్పుడు పురుడుపోసుకుంది? దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్ అమెరికాలోని గ్రీన్ లాండ్ లో చేపట్టిన తవ్వకాల్లో 20 లక్షల ఏళ్లనాటి డీఎన్ఏ బయటపడింది. ఇప్పటిదాకా లభించిన డీఎన్ఏలలో ఇదే అత్యంత పురాతనమైందంటారు శాస్త్రవేత్తలు. డీఎన్ఏ పూర్తి స్వరూపం డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం. ఇది ప్రాణుల్లో ఉండే జన్యువుకు సంబంధించింది. జీవుల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. దీని ఆధారంగా జీవం పుట్టుకను తెలుసుకునే వీలుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే డీఎన్ఏ అనేది జీవానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. గ్రీన్ లాండ్ లోని ఉత్తర భాగం… ఆర్కిటిక్ మహాసముద్రం సంధిభాగంలో చేపట్టిన తవ్వకాల్లో ఈ డీఎన్ఏ అవశేషాలు లభించాయి. అంతరించిపోయిన ఒక ఏనుగు జాతి, దుప్పి, కుందేళ్లు, లెమింగ్స్, బాతులకు సంబంధించిన డీఎన్ఏ ఇందులో ఉందన్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు ఏపుగా పెరిగే పలు జాతి చెట్లతోపాటు బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మక్రిముల అవశేషాలు లభించినట్లు తెలిపారు. ఉత్తర, మధ్య అమెరికా ప్రాంతాల్లో అంతరించిపోయిన జంతు జాతుల్లో ఒకటి మాస్టొడాన్. మంచు యుగం నాటి క్షీరదాలు 10 వేల ఏళ్ల క్రితం అంతరించాయి. వాటితోపాటే మాస్టొడాన్ జాతి కూడా కనుమరుగైంది. ఇంతవరకు గ్రీన్ లాండ్ లో కనిపించని మాస్టొడాన్ అవశేషాలు లభించడంపై సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఆర్కిటిక్, సమశీతోష్ణ పర్యావరణ వ్యవస్థ ఆధునిక అనలాగ్ తో కలిపి ఉండడమే ఆశ్చర్యకరంగా ఉందంటారు లండ్ బెక్ ఫౌండేషన్ జియోజెనెటిక్స్ సెంటర్ డైరెక్టర్ ఎస్కే విల్లర్స్ లెవ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందోనని ప్రస్తుతం మనం ఊహిస్తున్నది… 20 లక్షల ఏళ్ల క్రితమే గ్రీన్ లాండ్ లో ఉండడం అనేది చాలా విచిత్రంగా ఉందంటున్నారు సైంటిస్టులు. అలాంటి వాతావరణంలోనూ ఇప్పుడున్నట్లు జంతువులు, చెట్లు, మిగతా జీవజాలం ఉండడాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు ఎస్కే విల్లర్స్ లెవ్. డీఎన్ఏ అవశేషాలు గతంలో మంచులో దొరకాయి. ఇంకా ఏమైనా పురాతన జంతుజాలం ఆధారాలు లభిస్తాయేమోనని శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×