Big Stories

Warangal : అధికారుల నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం..

Warangal : అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధుడి పాలిట శాపమైంది. బ్రతికుండగానే చనిపోయినట్టు రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో ఆ వృద్ధుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరమయ్యాయి. జీవిత చెరమాంకంలో సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందకుండా పోయింది. అధికారుల తప్పిదం వల్ల తన జీవితం ఆగమ్యగోచరంగా మారిందని వాపోతున్నాడు ఆరేపల్లి అంకూస్ అనే వృద్ధుడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాలలో జరిగింది. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు విన్నవించేందుకు వృద్ధుడు రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం లేదని బాధపడుతున్నాడు.

- Advertisement -

రికార్డుల్లో చనిపోయాడని ఉండడంతో.. ఆరెపల్లి అంకూస్‌కు రేషన్ బియ్యం రావడం లేదు. చేతకాని ఈ వయసులో రేషన్ అందకపోతే తాను ఎలా బతకాలని వాపోతున్నాడు. బ్రతికున్న మనిషిని చనిపోయాడని ఎలా రికార్డులకు ఎక్కిస్తారని ప్రశ్నిస్తున్నాడు వృద్ధుడు. అధికారుల తీరు కారణంగా ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు రావడం లేదని.. రెండు నెలలుగా బియ్యం రాక, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు.

- Advertisement -

ఎవరూ లేక ఒంటరిగా ఉన్న తనను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అంకూస్ తెలిపారు. ఈ ఘటనపై రేషన్ డీలర్ ను సంప్రదిస్తే అంకూస్ కు రేషన్ బియ్యం రావడం లేదన్నది నిజమేనని తెలిపారు..ఆన్ లైన్ లో తన పేరు లేదని ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వృద్ధుడు వేడుకుంటున్నాడు. ఈ నెల అయిన రేషన్ బియ్యం అందించాలని కోరుకుంటున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News