Big Stories

ChatGPT:చాట్‌జీపీటీ పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌.. నెలకు ఎంతంటే?

ChatGPT:టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారిన చాట్‌జీపీటీ… ప్రారంభించిన 3 నెలలకే యూజర్ల నుంచి విశేష ఆదరణ పొందింది. రోజు రోజుకూ చాట్‌జీపీటీపై యూజర్లలో క్రేజ్ పెరిగిపోతుండటంతో… దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ, అందులో పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు… క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా… చాట్‌జీపీటీ ప్లస్ పేరుతో పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ప్రకటించాయి. నెలకు 20 డాలర్లు… అంటే మన కరెన్సీలో రూ.1600లు చెల్లించి చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి… పీక్ అవర్స్ లోనూ వేగవంతమైన యాక్సెస్, రెస్పాన్స్, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ లభిస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది.

- Advertisement -

చాట్‌జీపీటీ ప్లస్ ప్రస్తుతానికి అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఓపెన్ఏఐ భావిస్తోంది. అయితే… మిగతా దేశాల్లో చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చేదాకా… వినియోగదారులందరికీ ఉచిత యాక్సెస్‌ను అందించాలని కంపెనీ నిర్ణయించింది. మరోవైపు… చాట్‌జీపీటీపై ఎంత క్రేజ్ ఉందో… అంతే స్థాయిలో ఆందోళన కూడా ఉంది. ఒక్కసారి దానికి అలవాటు పడితే… చాట్‌జీపీటీకి పూర్తిగా బానిసలైపోతారనే భయం చాలా మందికి పట్టుకుంది. అందుకే… అమెరికాలోని చాలా స్కూళ్లలో… విద్యార్థులు చాట్‌జీపీటీని వినియోగించడాన్ని నిషేధించారు. దాంతో… చాట్‌జీపీటీ సామర్థ్యం, పరిమితులపై అధ్యాపకులతో చర్చిస్తున్నామని ఓపెన్ఏఐ ప్రకటించింది.

- Advertisement -

మనిషి మాదిరే రాతపూర్వక ఆవిష్కరణలు, అనువాదాల్లో చాట్‌జీపీటీ ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్‌లాగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్‌ చేయటంతో ఆగకుండా… సులభంగా అర్థమయ్యేలా సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. టాపిక్‌ చెబితే, దానికి తగ్గట్లు కొత్త కవితలు, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషుల మాదిరే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇస్తుంది. పిచ్చాపాటీ కబుర్లు చెప్పడంతో పాటు జోక్‌లూ వేస్తంది. యూజర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాట్‌బోట్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నా… వాటి పరిధి చాలా పరిమితం. అయితే అత్యంత వేగంగా, ఎదురుగా మనిషి కూర్చుని చెప్పినట్లే చెప్పడం చాట్‌జీపీటీ ప్రత్యేకత. అందుకే లక్షల సంఖ్యలో యూజర్లు చాట్‌జీపీటీపై మనసు పారేసుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News