BigTV English

Parasuram: త‌మిళ హీరోతో ప‌ర‌శురాం మూవీ!

Parasuram: త‌మిళ హీరోతో ప‌ర‌శురాం మూవీ!

Parasuram:ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం ఓ సినిమా చేస్తాడంటూ వార్త‌లు వినిపించాయి. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన‌ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నుకుంటే, అల్లు అర‌వింద్ మ‌ధ్య‌లో అడ్డం ప‌డ‌టంతో ప్రాజెక్ట్ మేట‌ర్ సైలెంట్ అయ్యింది. అయితే లేటెస్ట్‌గా ప‌ర‌శురాం సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌ర‌శురాం ఓ కోలీవుడ్ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌నేదే విష‌యం. మీడియాలో వినిపిస్తోన్న గుసగుస‌ల ప్రకారం ప‌ర‌శురాంతో సినిమా చేయ‌బోతున్న త‌మిళ హీరో ఎవ‌రో కాదు.. కార్తి. ఈయ‌న‌కు తెలుగు సినిమా చేయ‌టం కొత్తేమీ కాదు. ఇంత‌కు ముందు ఊపిరి చిత్రంలో నాగార్జున‌తో క‌లిసి కార్తి న‌టించిన సంగ‌తి తెలిసిందే.


చాలా గ్యాప్ త‌ర్వాత కార్తి మ‌రోసారి స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయ‌బోతున్నారు. అంటే ఈ సినిమా త‌మిళంలో రూపొంద‌దా? ఎందుకు త‌మిళంలో రాకుండా ఉంటుంది. కార్తికి త‌మిళంలో మంచి మార్కెట్టే ఉంది కాబ‌ట్టి కార్తి, ప‌ర‌శురాం సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతుంద‌న‌టంలో సందేహ‌మేమీ అక్కర్లేదు. అయితే ఇక్క‌డొక సందేహం రావ‌చ్చు. మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ, దిల్ రాజుల‌తో ప‌ర‌శురాం సినిమా ఆగిపోయిందా అని. కానీ అలాంటి దేమీ లేద‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమాను పూర్తి చేసిన త‌ర్వాతనే కార్తితో సినిమా చేస్తాడ‌ట ప‌ర‌శురాం.

ఈ లోపు కార్తి ఇప్పుడు త‌మిళంలో చేయాల్సిన సినిమాల‌ను పూర్తి చేసుకుంటాడ‌ట‌. మ‌రి కార్తి, ప‌ర‌శురాం సినిమాను ఎవ‌రు నిర్మిస్తార‌నేది చూడాలి. మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దిల్ రాజు, ప‌ర‌శురాం కాంబినేష‌న్ మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి మ‌రి.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×