BigTV English

Tesla Super Charger : టెస్లాతో పార్ట్‌నర్‌షిప్స్.. వాటికోసమే..

Tesla Super Charger : టెస్లాతో పార్ట్‌నర్‌షిప్స్.. వాటికోసమే..
Tesla Super Charger


Tesla Super Charger : టెస్లా అనే ఎన్నో దేశాల ఆటోమొబైల్ కంపెనీలకు పీడకలలాగా మారింది. ఇప్పటివరకు ఏ ఆటోమొబైల్ కంపెనీ ఆలోచించని కొత్త టెక్నాలజీ టెస్లా మార్కెట్లోకి రావడంతో చాలావరకు ఆటోమొబైల్ కస్టమర్లను తనవైపు లాక్కుంది. ఇప్పటికీ ఎన్నో కంపెనీలు టెస్లా స్పీడ్‌ను అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అదంతా సులభం కాదని అర్థం చేసుకున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మాత్రం టెస్లా సాయాన్ని కోరుతున్నాయి ఇతర సంస్థలు.

టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అనేవి ప్రపంచంలోనే ఒక ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా వాటి సూపర్‌ఛార్జర్స్ అయితే తోటి కంపెనీల దగ్గర నుండి కూడా ప్రశంసలు పొందుతున్నాయి. ఈ సూపర్‌ఛార్జర్స్‌ను ఉపయోగించుకోవడం కోసం కొన్ని కంపెనీలు టెస్లాతో పార్ట్‌నర్‌షిప్‌కు కూడా సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఫార్డ్.. టెస్లాతో తన పార్ట్‌నర్‌షిప్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రక్ కంపెనీ రివియన్ కూడా ఈగోను పక్కన పెట్టి మరీ టెస్లాతో పార్ట్‌నర్‌షిప్ చేసుకున్నట్టు ప్రకటించింది. దీంతో టెస్లాలోని టెక్నాలజీ గురించి మరొక్కసారి మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు కస్టమర్లు.


పార్ట్‌నర్‌షిప్స్ చేసుకున్న కంపెనీలు తమ సూపర్‌ఛార్జర్స్‌ను ఉపయోగించుకోవచ్చని మస్క్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో మరికొన్ని కంపెనీలు కూడా ఈ సూపర్‌ఛార్జర్స్ కోసం అద్భుతమైన డీల్స్‌తో మస్క్‌ను అప్రోచ్ అవ్వనున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇతర కంపెనీలు కూడా టెస్లా ఈవీలు ఛార్జర్స్ ఉపయోగించడం వల్ల తమ కంపెనీ పేరు ప్రఖ్యాతలే పెరుగుతాయని టెస్లా భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఇది టెస్లాకు ఫ్రీ ప్రమోషన్‌గా కూడా మారనుంది.

ఇతర ఆటోమొబైల్ సంస్థలు లాభాలు, పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు పడుతుండగా.. మస్క్ ఏ మాత్రం ఆలోచించకుండా టెస్లాలో తమకు పార్ట్‌నర్‌షిప్ ఇవ్వడం గురించి నిపుణులు సందేహపడుతున్నారు. ఈ పార్ట్‌నర్‌షిప్స్ ద్వారా మస్క్ కూడా చాలా లాభం పొందే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఆటోమొబైల్ రంగాలు కలిసి ముందుకెళ్తూ.. కలిసికట్టుగా రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ పార్ట్‌నర్‌షిప్స్ ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×