Big Stories

Penchalakona : వారంలో ఒక్క రోజే పూజ

- Advertisement -

Penchalakona : పచ్చని కొండల మధ్య ఎత్తైన గోపురంతో, విశాలమైన ప్రాంగణం కలిగిన క్షేత్రం పెంచల కోన. నెల్లూరు జిల్లాలోని పెంచల కోనలో నరసింహస్వామి పెంచలయ్య పేరుతో పూజలు అందుకుంటున్నారు. అమ్మవారు చెంచులక్ష్మిగా భక్తులతో పూజలందుకుంటోంది. దక్షిణ భారతంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి పెంచలకోన. ఉగ్రరూపంలో వచ్చిన నరసింహస్వామిని దేవతల కోరిక అమ్మవారు చెంచులక్ష్మి అవతారంలో శాంతింప చేశారని పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

దేవదేతవలు ఇద్దరూ స్వయంగా శిలగా వెలిసిన ప్రాంతం ఇదే. పూర్వం ఈ ప్రాంతంలో నిత్యపూజలు జరిగేవి కావు. వారానికి ఒకసారి మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత కొండపై ఆలయం నిర్మించిన తర్వాత పూర్తి స్థాయిలో నిత్య పూజలు జరుగుతున్నాయి. పచ్చని అడవిలో ఏటా వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. వేలాదిమంది భక్తులు ఆ వారం రోజుల్లో క్షేత్రానికి వస్తుంటారు. స్వామివారు ఆవిర్భవించిన కొండ వెలికొండగా పేరుగాంచింది. ఆంజనేయుడు సంజీవిని కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతభాగం విరిగిపడటంతో వెలికొండ అయిందని చరిత్ర చెబుతోంది. అందుకే హనుమంతుడే ఈ పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు.

ఈ ఆలయం దట్టమైన అడవుల్లో ఉన్నప్పటికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న పురుగు కూడా ఇక్కడకి వచ్చే భక్తులకి ఎలాంటి అపకారం చేయవు. ఈ ఆలయ గర్భగుడిని సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పెంచల స్వామి దర్శనం కోసం ఏప్రిల్-మే మధ్య ఎక్కువుగా భక్తులు తరలివస్తుంటారు. ఎంతో ప్రశాంత వాతావరణం మధ్యలో ఉండే ఆలయానికి వచ్చే భక్తులు ఆ కాసేపు ప్రశాంతంగా ఫీలవుతుంటారు. ఆలయానికి దగ్గర్లోనే పెంచల కోన జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అందాల జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News