Big Stories

Plants Can Feel The Touch: స్పర్శను కనిపెట్టే మొక్కలు.. ఇతర మొక్కలకు సంకేతాలు..

Plants Can Feel The Touch : మానవాళితో పాటు భూమిపై జీవించే ఇతర జీవరాశులకు కూడా భూమిపై సమాన హక్కు ఉంది. ముఖ్యంగా మొక్కలు అనేవాటిని మనుషులు బాగా చూసుకుంటే.. అవి మానవాళికి ఉపయోడగపడే వనరులను అందిస్తాయి. అంతే కాకుండా మనుషులతో మొక్కలకు ఉండే సంబంధమే అవి ఆరోగ్యంగా పెరిగేలా సహాయపడతాయని నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా మొక్కల గురించి మరొక కొత్త విషయం కూడా బయటపెట్టింది.

- Advertisement -

మొక్కలకు నరాలు అనేవి ఉండవు, మనుషుల్లాగా చేతులు, కాళ్లు.. ఇవేవి ఉండవు. అయినా కూడా మనుషులు తమ చుట్టూ ఉన్నప్పుడు, తమను తాకినప్పుడు వాటికి తెలుస్తుందని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. వాటిని ఎప్పుడు ముట్టుకున్నారు, ఎప్పుడు వదిలేశారు అనే విషయాలను అవి గమనించగలవని తెలిపారు. ముందుగా ఒక గ్లాస్ రాడ్‌తో ఒక మొక్కను తాకి చూసినప్పుడు.. ఆ స్పర్శ గురించి ఇతర మొక్కలకు అవి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా కనిపెట్టారు. దానిని తాకకుండా వదిలేసినప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో సిగ్నల్స్ వెళ్లాయని గమనించారు.

- Advertisement -

ఇప్పటివరకు మొక్కలు అనేవి టచ్‌కు స్పందిస్తాయని మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ అవి ఆ స్పర్శ గురించి ఇతర మొక్కలకు వేవ్స్ రూపంలో సందేశం పంపిస్తాయని తొలిసారిగా కనిపెట్టారు. దీన్ని బట్టి ప్లాంట్ సెల్స్ అనేవి ఎంత సెన్సిటివ్‌గా ఉంటాయని వారు తెలుసుకున్నారు. టచ్ వల్ల కలిగే ప్రెజర్‌ను అవి సులువుగా తెలుసుకుంటున్నాయన్నారు. కానీ ఆ స్పర్శ వల్ల జంతువులు స్పందించే తీరుకు, మొక్కలు స్పందించే తీరుకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.

ఈ ప్రయోగాల కోసం 12 మొక్కలను ఎంపిక చేసుకున్నారు శాస్త్రవేత్తలు. వీటిపై మొత్తం 84 ప్రయోగాలను చేశారు. ఒక మొక్కను టచ్ చేసిన 30 సెకండ్లలోపే అవి ఇతర మొక్కలకు వేవ్స్ రూపంలో సంకేతాలు పంపిస్తున్నాయని గమనించారు. ఈ వేవ్స్ అనేవి 3 నుండి 5 నిమిషాల వరకు ఉంటాయని కనిపెట్టారు. కానీ ఈ వేవ్స్ వేగం ఎక్కువగా ఉంటే 1 నిమిషంలోపే ఆగిపోతాయని అన్నారు. దీన్ని బట్టి ప్లాంట్ సెల్స్ అనేవి ఎంత బలంగా ఉంటాయని తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News