Warangal Airport Clearance: వరంగల్ ఎయిర్ పోర్టు గతంలోనే ఆసియాలోనే నంబర్ వన్‌గా ఉండేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మామునూర్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ పై ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
తన హయాంలో వరంగల్ ఎయిర్ పోర్ట్ క్లియరెన్స్ రావడం సంతోషకరంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ కు అనుమతి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ లో బ్రహ్మాండమైన ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే వరంగల్ నుంచి విమానాలు నడిచాయని అన్నారు. గత ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల ఎయిర్ పోర్టు నిర్మాణం జరగలేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.
ALSO READ: PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280
వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి ఎంతో కాలంగా చర్చలు జరిగాయని మంత్రి అన్నారు. మామూనూర్ ఎయిర్ పోర్టు కోసం ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. మోదీ పాలనలో విమానయాన రంగంలో విప్లవాత్మక విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని చెప్పారు. మామునూరులో 260 ఎకరాల భూమి అదనంగా కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ALSO READ: CM Revanth Reddy: వనపర్తిలో సీఎం రేవంత్ పర్యటన.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ మరో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ‘భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టు కోసం ఫిజుబిలిటీ స్టడీ చేశాం. రిపోర్ట్ సానుకూలంగా వస్తే భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. చిన్న పట్టణాల నుంచి ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయి. ఎయిర్ పోర్టుల రాకంతో అభివృద్ది వేగవంతం అవుతోంది’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
‘పర్యాటక ప్రాంతంగా వరంగల్ చాలా ప్రసిద్ధి చెందింది. మామునూర్ ఎయిర్ పోర్టు రాకతో వేగంగా వరంగల్ ఇంకా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా మామునూరులో భూసేకరణ పూర్తి చేయాలి. ప్రభుత్వం భూమి అప్పగించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. రెండున్నరేళ్లలోనే మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం. మోదీ ప్రధానమంత్రి కాకముందు భారత్‌లో 76 విమానాశ్రయాలు ఉండేవి. ఆయన ప్రధాని అయ్యాక ఇప్పటివరకు 159 విమానాశ్రయాలకు ఆ సంఖ్య పెరిగింది. మామునూరులో ముందుగా డొమెస్టిక్, కార్గోకు వినియోగిస్తామని, డిమాండ్ ను బట్టి ఇంటర్నేషనల్ కూడా ప్లాన్ చేస్తాం’ అని మంత్రి తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్ లో ఎయిర్‌పోర్ట్ రావాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందని అన్నారు. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ కూడా గత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చర్చించారని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.