BigTV English
Advertisement

scientists are ready to change the way of lightning and reduce its effects : మెరుపులను మళ్లించే మార్గం.. లేజర్ ప్రయోగం..

scientists are ready to change the way of lightning and reduce its effects : మెరుపులను మళ్లించే మార్గం.. లేజర్ ప్రయోగం..

scientists are ready to change the way of lightning and reduce its effects : టెక్నాలజీ అనేది మనుషులకు అర్థం కాని ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకువచ్చింది. అసాధ్యం అనుకున్న ఎన్నింటినో సాధ్యం చేసి చూపించింది. తాజాగా పలువురు శాస్త్రవేత్తలు కలిసి మెరుపులను దారిమళ్లించే ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కూడా అవ్వడంతో వారు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.


వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు లాంటి వాటి వల్ల మనుషులకు ప్రమాదాలు జరగడం గురించి తెలిసిందే. అంతే కాకుండా వాటి వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఫారిన్ దేశాల్లో ఎత్తైన భవనాలు మీద ఉరుములు, మెరుపులు పడడంతో అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే లేజర్ ఫిలమెంట్స్ ద్వారా మెరుపులు ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించవచ్చని శాస్త్రవేత్తలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీని ద్వారా ఫిజిల్స్‌లో ఉరుములు, మెరుపుల నుండి తప్పించుకోవడం విషయంలో కొత్త అధ్యాయనం ప్రారంభం కానుందని వారు అన్నారు.

ఉరుములు, మెరుపుల గురించి సంబంధించిన పరిశోధన మొదటిసారిగా 2021 స్విట్జర్‌ల్యాండ్‌లోని శాంటిస్ పర్వతం వద్ద జరిగింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపుల వల్ల యూరప్‌లో ఎఫెక్ట్ అయిన టవర్ వద్ద ఈ పరిశోధన చేపట్టారు. ఓ శక్తివంతమైన లేజర్ సాయంతో మెరుపును మళ్లించారు. ఈ లేజర్ ద్వారా మెరుపు భూమి మీద పడకముందే పలు మీటర్ల దూరం వెళ్లిందని వారు గమనించారు. ఒక సెకనుకు 1000 సార్లు ఈ లేజర్లను ఆకాశంలోకి పంపించడంతో మెరుపులు వాటి దిశకు మార్చుకుంటున్నట్టు వారు గమనించారు. ఇదంతా హై స్పీడ్ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ లేజర్ పరికరం చూడడానికి ఓ పెద్ద కారు ఆకారంలో ఉండి మూడు టన్నుల బరువు ఉంటుందని సమాచారం.


ఈ పరిశోధనల్లో జెనీవా విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా కీలక పాత్ర పోషించారు. 1970ల్లోనే ఈ ఆలోచన వచ్చినా కూడా ఇప్పటివరకు కేవలం ల్యాబ్ వరకే ఈ పరిశోధన పరిమితమయ్యింది. ఇన్నాళ్లకు దీనిని ఫీల్డ్‌లో ప్రయోగించి చూశారు శాస్త్రవేత్తలు. ఈ లేజర్ ప్రయోగం ఎలాంటి వాతావరణంలో అయినా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రంగా మంచు పడుతున్న సమయంలో అయినా లేదా ఆకాశం మబ్బులతో నిండిపోయిన సమయంలో అయినా ఈ లేజర్ ప్రయోగం విజయవంతంగానే సాగిందని వారు అన్నారు. ప్రస్తుతానికి ఈ లేజర్ మెరుపులను కొంత దూరం వరకే జరుపుతుందని, ఇకపై మరికొంత దూరం జరపడానికి ప్రయోగాలు మొదలుపెట్టాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Follow this for more updates :- Bigtv

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×