BigTV English

Robot :మార్కెట్లోకి కొత్త ‘రైబో’.. ప్రత్యేకత ఏంటంటే..?

Robot :మార్కెట్లోకి కొత్త ‘రైబో’.. ప్రత్యేకత ఏంటంటే..?

Robot :శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన ఎన్నో అద్భుతమైన క్రియేషన్స్‌లో రోబోలు కూడా ఒకటి. ఈ రోబోలు కేవలం పరిశోధనల వరకే పరిమితం కాకుండా ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాలుగా ఉపయోగించబడుతున్నాయి. అందుకే ఈ రోబోలను ఇంకా అడ్వాన్స్‌డ్‌గా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. తాజాగా అలాంటి ఓ కొత్త రకమైన రోబోకు టెస్టింగ్ జరిగింది.


రోబోలను ఇప్పటివరకు మనిషి రూపంలోనే కాదు ఇతర జీవుల ఆకారంలో కూడా తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే నిజమైన కుక్కల్లాగా ఉండే రోబోలు టెక్ మార్కెట్లో సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా ఆ కుక్క రోబోలతో ఓ కొత్త రకమైన పరిశోధన జరిగింది. ఇసుకలో మామూలుగా తొందరగా నడవడం చాలా కష్టం. అందుకే ఇసుకలో నడవగలిగే ఓ కుక్క రోబోను శాస్త్రవేత్తలు తయారు చేశారు.

ఈ కుక్క రోబోలు ఇసుకలో సెకనుకు మూడు మీటర్ల దూరంతో ప్రయాణించగలవు. ఈ రోబోను కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కైస్ట్) శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇలాంటి ఒక రోబోను తయారు చేయాలనే ఆలోచన వారి నుండే పుట్టింది. ఈ కుక్క రోబో కేవలం కఠినంగా ఉన్న నేలపైనే కాదు సున్నితంగా ఉన్న నేలపైన కూడా బ్యాలెన్స్ తప్పకుండా నడవగలదని వారు తెలిపారు.


ఇప్పటికే కుక్క రూపంలో తయారు చేసిన రోబోలు న్యూయార్క్, ఫ్రాన్స్ దేశాల పోలీసులను క్రైమ్ సీన్స్‌ను స్టడీ చేయడానికి సాయం చేశాయి. అంతే కాకుండా ఈ రకం రోబోలు కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడడం, అంతే కాకుండా పాడమంటే పాటలు, ఫోటోలు తీయమంటే ఫోటోలు కూడా తీస్తాయి. తాజాగా ఎలాంటి నేలపైన అయినా నడిచే కుక్క రోబోను తయారు చేసిన శాస్త్రవేత్తలు దానికి ‘రైబో’ అనే పేరు పెట్టారు.

కృత్రిమ మేధస్సు ద్వారా శాస్త్రవేత్తలు.. రైబోకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. తను ఎలాంటి నేలపై నడుస్తుందే తెలుసుకునేలా రైబోకు ఓ న్యూరల్ నెట్‌వర్క‌ను ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి ఆ నేలపై ఎలా నడవలో రైబోకు అర్థమవుతుంది. బీచ్ లాంటి చోట్లలో నడిచేటప్పుడు దాని కాళ్లు పూర్తిగా ఇసుకలో ఉండిపోయిన సెకనుకు 3.03 మీటర్ల వేగంతో అది నడవగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతే కాకుండా సెకనుకు 90 డిగ్రీలు పడకుండా తిరగగలదని కూడా వారు తెలిపారు. ఈ పరిశోధనల్లో కైస్ట్‌కు మద్దతుగా నిలిచింది సామ్‌సంగ్.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×