BigTV English

PCR Test:ర్యాపిక్ టెస్ట్‌కంటే వేగంగా పీసీఆర్ రిజల్ట్..

PCR Test:ర్యాపిక్ టెస్ట్‌కంటే వేగంగా పీసీఆర్ రిజల్ట్..

PCR Test:టెక్నాలజీ అనేది చాలా మెరుగుపడింది. ముఖ్యంగా వైద్యరంగంలో ఇది మానవాళి భరోసా ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఏ వ్యాధి గురించి, ఏ ఆరోగ్య సమస్య గురించి భయపడే అవసరం లేకుండా టెక్నాలజీ అనేది అన్నింటికి చికిత్స అందించే విధంగా ఏర్పాటయ్యింది. అయినా కూడా శాస్త్రవేత్తలు ఈ రంగంలో ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మెరుగైన వైద్య పరీక్షను మరింత మెరుగ్గా చేయడానికి వారు పరిశోధనలు చేపట్టారు.


పీసీఆర్ అనేది చాలామందికి తెలిసిన ఒక వైద్యపరీక్ష. ఇది శరీరంలోని డీఎన్ఏ శాతాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి శరీరంలో న్యూక్లియక్ ఆసిడ్స్‌ను వైద్యులు కనుక్కోవడానికి సులభంగా ఉంటుంది. 1984 నుండే పీసీఆర్ టెస్ట్ ప్రజలకు అందుబాటులో ఉంది. ఒకప్పుడు కేవలం కొంతమందికే తెలిసిన ఈ టెస్ట్.. కోవిడ్ 19 తర్వాత చాలామందికి పరిచయమయ్యింది. ఒక మనిషికి కోవిడ్ అటాక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి పీసీఆర్ టెస్ట్‌నే ఎక్కువగా ఉపయోగించారు.

పీసీఆర్ టెస్ట్ అనేది పేషెంట్లకు ఉపయోగపడేలా ఉన్నా.. అందులో కూడా ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఈ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి కనీసం ఒకటి నుండి రెండు గంటల సమయం పడుతుంది. అయితే ర్యాపిక్ టెస్టుల పేరుతో టెక్నాలజీని మెరుగుపరిచిన టెస్ట్ రిజల్ట్ కోసం మాత్రం వేచి ఉండడం తప్పలేదు. తాజాగా కొరియా శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారం కనుగొన్నామని ప్రకటించారు. వారొక అల్ట్రాఫాస్ట్ పీసీఆర్ టెక్నాలజీని డెవలప్ చేశామని బయటపెట్టారు.


అల్ట్రాఫాస్ పీసీఆర్ టెస్ట్ అనేది దాదాపు 10 రెట్ల సమయాన్ని తగ్గిస్తుందని కొరియా శాస్త్రవేత్తలు అన్నారు. దీంతో టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది కేవలం అయిదు నిమిషాల్లో మన ముందు ఉంటుందని వారు తెలిపారు. అందుకే దీంతో ఒక్కసారి టెస్ట్ చేయగానే శరీరంలోని వివిధ రకాల కోవిడ్ వైరస్‌ను గుర్తించగలదని వారు బయటపెట్టారు. అయితే ఈ విభాగంలో వారు మరిన్ని పరిశోధనలు చేసి ఈ అల్ట్రాఫాస్ట్ పీసీఆర్ టెస్టును ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

MetaVerse:ఆరోగ్యానికి మేలు చేసే మెటావర్స్..

America China:ఆ విషయంలో అమెరికా, ఇండియా మధ్య ఒప్పందం..

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×