Big Stories

Somesh Kumar : సోమేష్ కుమార్ భూచిత్రాలు.. బ్లాక్‌మనీతోనే భూములు కొన్నారా?

Somesh Kumar : రిటైర్డ్ ఐఏఎస్ సోమేష్ కుమార్ బాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. సోమేష్ బ్లాక్‌మనీతో భారీగా దందాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాసన్‌నగర్‌ ఇంటిని అమ్మి భూములు కొన్నానని సోమేష్‌కుమార్‌ చెబుతున్నారు. ఆ ఇంటిని 12 కోట్లకు అమ్మారు. కానీ 5 కోట్ల 75 లక్షలకే అమ్మినట్లు చూపారు. 2019లో కొల్లూరులో 40 కోట్లకు అమ్మిన ఎకరం భూమిని.. కేవలం 10 కోట్లకే అమ్మినట్లు చూపారు.

- Advertisement -

ఫార్మా సెజ్ వస్తుందనే సమాచారంతో యాచారంలో 25 ఎకరాల భూములు భార్య పేరిట కొనేశారు. ఫార్మా సెజ్ వస్తున్న వివరాలు పక్కాగా తెలియడం వల్లే.. పక్క సర్వే నెంబర్‌లో భూములు కొన్నారు. ఫార్మా సెజ్‌ విషయం రైతులకు తెలియకముందే.. సోమేష్‌ భారీగా భూములు కొనేశారు. ఆయన ఎకరా 20 లక్షలకు పైగానే చెల్లించి కొన్నారని స్థానికులు చెబుతున్నారు. కానీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో ఎకరా రెండున్నర లక్షలకే కొన్నట్లు చూపించారు. డాక్యుమెంట్‌లో చూపించిన విలువకే చెక్ ద్వారా పేమెంట్లు చేయడంతో.. మిగిలినదంతా బ్లాక్ మనీ ఇచ్చారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

- Advertisement -

2018 మార్చిలో ఫార్మాసెజ్‌పై ప్రభుత్వ ప్రకటన వచ్చింది. అంతకుముందే జనవరి, ఫిబ్రవరిలో సోమేష్ భార్య పేరిట రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అంతేకాదు.. శంషాబాద్‌లో సోమేష్ బావమరిది పేరిట 100 ఎకరాలున్నాయి. బినామీ పేర్లతో సోమేష్‌ హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా భూములు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూకట్‌పల్లిలోనూ సోమేష్ కుటుంబం ఖరీదైన విల్లా కొనుగోలు చేసింది.

ఫీనిక్స్‌పై జరిగిన ఐటీ సోదాల్లో సోమేష్ పెట్టుబడులు సంగతి బయటపడినట్లు సమాచారం. వివాదాస్పద భూముల్లో కట్టిన విల్లాను సోమేష్‌ తక్కువ ధరకే కొట్టేశారా? ఈ ఆస్తుల వివరాలన్నీ DOPT కి ఇచ్చారా? సోమేష్ నడిపించిన బ్లాక్ దందా విలువ ఎంత? అనే అంశాలపై తెలంగాణ సర్కార్‌ పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News