BigTV English

Simple Tips to Prevent pimples : మొటిమలు నివారించే సింపుల్‌ చిట్కాలు

Simple Tips to Prevent pimples : మొటిమలు నివారించే సింపుల్‌ చిట్కాలు
Simple Tips to Prevent pimples

Simple Tips to Prevent pimples : ముఖంపై మొటిమ వచ్చిందంటే చూసేందుకు అసహ్యంగా కనిపించడంతో పాటు నొప్పిగా కూడా ఉంటుంది. మార్కెట్‌లో దొరికే రకరకాల ఖరీదైన క్రీములను వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అయితే మొటిమలు నివారించడానికి ఇంట్లోనే ఈ చిట్కాలను పాటించడం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది. తరచూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బయట తిరిగే వాళ్లకి చర్మ రంధ్రాల్లో దుమ్ము చేరి మొటిమలు ఎక్కువగా వస్తాయి.


ముఖాన్ని రెగ్యులర్‌గా శుభ్రం చేసుకోకపోతే, చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి . ఆ ప్రదేశంలో వైట్‌హెడ్, బ్లాక్‌హెడ్స్ వచ్చి అసహ్యంగా కనిపిస్తుంటాయి. చర్మానికి రెగ్యులర్‌గా మాయిశ్చరైజ్ చేయడంతో చర్మం సాఫ్ట్‌, షైనీగా ఉంటుంది. ముఖంలో మొటిమలు సమస్యాత్మకంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే చేతులతో మరియు గోళ్ళతో మొటిమలను టచ్ చేస్తే అవి మరింత ఎక్కువ అవుతాయి. మొటిమలను స్క్రాచ్ చేయడంతో తగ్గడం కూడా ఆలస్యమవుతుంది. అంతేకాకుండా మచ్చలు ఏర్పడి మరింత అస్యహ్యంగా కనిపిస్తారు. క్రీములు, లోషన్లు పైకి మాత్రమే మాయిశ్చరైజింగ్‌గా పనిచేస్తాయి. అంతర్గతంగా శుభ్రం కావాలంటే మాత్రం తగినన్ని నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

పరిమితికి మించి మేకప్ వేసుకోవడం, రెగ్యులర్‌గా మేకప్‌లో ఉండటం వల్ల కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. సూర్య రశ్మి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే పరిమితి మించితే మాత్రం చర్మ సమస్యలు తప్పవు. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఎక్కువ ఎండలోకి వెళ్లకపోవడమే మంచిది. మంచి సన్ క్రీమ్‌ను వాడాలి. సన్ గ్లాస్ ఉపయోగించాలి. అధిక ఒత్తిడి వల్ల కూడా మొటిమలు వస్తాయి. ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫుల్ పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మొటిమలు క్రమంగా పెరుగుతాయి.


మానసిక ప్రభావం మొటిమలపై ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులను దూరం చేయడమే కాదు చర్మం కూడా మెరుస్తుంది. మొటిమల చికిత్సలో చర్మ సంరక్షణ చిట్కాలలో ఒకటి ముఖం మీద అవాంఛిత రోమాలు లేకుండా చూడాలి. చర్మం మీద ఉండే జుట్టు ఆయిలీగా మారడం వల్ల స్కిన్ ఇరిటేషన్, మొటిమలకు కారణం అవుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్, డిస్ ఇన్ఫెక్ట్, హీలింగ్ ప్రొపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే ముఖం క్లియర్‌, హెల్తీగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తాయి. ముఖ్యంగా చెమట ద్వారా చర్మంలోని టాక్సిన్స్‌ను బయటికి పంపిస్తాయి. చర్మంలోని మలినాలను తొలగించుకుంటేనే మొటిమలను నివారించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×