Sitaram Yechury’s Health critical: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. గత రెండు రోజుల్లో మరింత క్షీణించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీతారాం ఏచూరిని గత నెల 19న ఎయిమ్స్‌లో కుటుంబ సభ్యులు చేర్పించారు. సీతారం ఏచూరికి ఎయిమ్స్ సీనియర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సీతారాం ఏచూరిని వెంటిలేటర్‌పై ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆందోళనకరంగా ఉన్న ఆయనను కాపాడేందుకు ప్రత్యేక డాక్టర్ల బృందం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదట తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించామని, కానీ రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. కాగా, ఇటీవల ఆయనకు కంటి శస్త్రచికిత్స కూడా జరిగింది.
Also Read: ప్రధాని స్టయిల్.. సీజేఐ ఇంట్లో మోదీ.. ఆసక్తిగా గమనిస్తున్న విపక్షాలు..
ఇదిలా ఉండగా, సీతారం ఏచూరి.. జేఎన్టీయూ విద్యార్థి నుంచి ఢిల్లీ ప్రాంతాలతోపాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. సీపీఎంలో జాతీయ స్థాయికి వెళ్లిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో సీపీఎంకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గతంలో యూపీఏ ప్రభుత్వంలో సీపీఎం భాగస్వామిగా ఉండేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రముఖ రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు.