BigTV English

PM Modi in CJI House: ప్రధాని స్టయిల్.. సీజేఐ ఇంట్లో మోదీ.. ఆసక్తిగా గమనిస్తున్న విపక్షాలు..

PM Modi in CJI House: ప్రధాని స్టయిల్.. సీజేఐ ఇంట్లో మోదీ.. ఆసక్తిగా గమనిస్తున్న విపక్షాలు..

PM Modi in CJI House: ప్రధాని నరేంద్రమోదీ స్టయిల్ మార్చారా? ట్రెండ్ సెట్ చేస్తున్నారా? సెంటిమెంట్‌ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారా? తన గురించి విపక్షాలు చర్చించుకునేందుకు స్కెచ్ వేశారా? ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఏ ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడినా ప్రధాని మోదీ గురించే. అసలు ఢిల్లీలో అసలేం జరుగుతోంది?


ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ ఎత్తుల గురించి చెప్పనక్కర్లేదు. పార్టీ కంటే.. తన గురించి ప్రజలు, రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువగా మాట్లాడుకునే చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో ఆయన ఆరి తేరారని కొందరు సీనియర్ రాజకీయ నేతలు సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు.

ALSO READ: ‘ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారు..? నేనే సీఎంగా..’


గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా గమనించేవారు. కొత్త విషయాలు ఏమైనా చెబుతున్నారా? వినేవారు. ఇప్పుడు ప్రజల్లో ఆయన పట్ల ఆదరణ తగ్గినట్టు కనిపిస్తోంది. అందుకు ఎగ్జాంఫుల్ రీసెంట్‌గా జరిగిన లోక్‌సభ ఎన్నికలే.

ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో ప్రధాని నరేంద్రమోదీకి తిరుగులేదని అంటుంటారు. అఫ్‌కోర్స్.. ఇప్పుడు అదే చేశారనుకోండి. గణేష్ వేడుకల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. ముఖ్యంగా మహారాష్ట్ర సంప్రదాయంలో టోపీ ధరించి మరీ హాజరయ్యారు. ఆయన సీజేఐ డీవై చంద్రచూడ్, ఆయన భార్య కల్పనాదాస్ స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గణపతి పూజకు హాజరై హారతి ఇచ్చారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు.

ప్రధాని నేరుగా సీజేఐ ఇంటికి వెళ్లడాన్ని రాజకీయ నాయకులు రకరకాలుగా చర్చించు కోవడం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైపోయింది. సీజేఐ చంద్రచూడ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తని, అందులోనూ వారికి ముఖ్యమైన పండుగ గణేష్ ఫెస్టివల్ అని అంటున్నారు. ఈ వాదనను తోసి పుచ్చుతున్నవాళ్లు లేకపోలేదు.

మీడియా అటెక్షన్ కోసమే ఇదంతా చేస్తున్నారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. గడిచిన నాలుగైదు రోజులుగా నేషనల్ మీడియాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అమెరికా టూర్‌‌‌లో చేసిన కామెంట్స్ గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి.. ప్రధాని నరేంద్రమోడీ వేసిన ఎత్తుగడగా వర్ణిస్తున్నారు. వీటి గురించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వార్తలు హంగామా చేస్తాయో చూడాలి.

 

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×