Big Stories

Smart Fabrics : చెమటను స్టడీ చేసి శరీర యాక్టివిటీని చెప్పే స్మార్ట్ ఫ్యాబ్రిక్స్..

Smart Fabrics : వ్యాయామం అనేది మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ వ్యాయామం సమయంలో కూడా మనిషి పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ముందుగా ప్రతీ వయసు వారికి తగిన వాతావరణం ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన దాని ప్రకారం ప్రపంచంలో ఏడాదికి సంభవిస్తున్న 5 మిలియన్ అకాల మరణాలు శారీరికంగా బలంగా లేకపోవడం వల్లే జరుగుతున్నాయని తేలింది. అందుకే వ్యాయమం అనేది మనిషికి చాలా ముఖ్యమని సంస్థ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఈరోజుల్లో మనిషి శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను గుర్తించడానికి కూడా ఎన్నో రకాల టెక్నికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. హార్ట్ రేట్, న్యూట్రీషన్ లెవల్, హైడ్రేషన్ లెవల్, టెంపరేచర్.. వంటి వాటిని కనుక్కోవడానికి ఉపయోగపడే పరికరాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. క్రీడాకారులు కూడా ఎప్పటికప్పుడు తమ శరీరంలో మార్పులు తెలుసుకోవడానికి ఎన్నో వేరేబుల్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. కేవలం క్రీడాకారులు అనే కాదు చాలామంది ఈ డివైజ్‌లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు.

- Advertisement -

ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే వారు మాత్రమే ఎప్పటికప్పుడు తమ శరీరంలోని మార్పులను గమనించగలుగుతున్నారు. ఉపయోగించని వారు మాత్రం వాటి గురించి తెలుసుకోవడంలో వెనకబడుతున్నారు. అందుకే అందరికీ సమానంగా శరీరంలోని మార్పులు తెలుసుకునే అవకాశం కలిగే విధంగా పరికరాలను తయారు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ ఫ్యాబ్రిక్స్, స్వెట్ సెన్సార్లను తయారు చేయాలని స్పానిష్ శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

రోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్ అనేవి రాకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ప్రపంచంలో చాలామంది శరీరానికి సరైన వ్యాయామం అందడం లేదని తేల్చారు. వయసు పైబడిన వారికి, వేడి వాతావరణంలో నివసించే వారికి వ్యాయామం అనేది లేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని తెలిపారు. అందుకే వ్యాయామాన్ని యూనివర్సల్ యాక్టివిటీ చేయాలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా వ్యాయామం చేస్తున్న సమయంలో మనిషి శరీరంలోని మార్పులు గమనించడానికి తయారు చేసేవే స్మార్ట్ ఫ్యాబ్రిక్స్.

ప్రతీరోజూ వ్యాయామం సమయంలో మనుషులు వేసుకునే బట్టలలోనే వారి శరీరంలో జరిగే మార్పులను గుర్తించే విధంగా టెక్నాలజీని అమర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ సాయంతో ఈ స్మార్ట్ ఫ్యాబ్రిక్స్‌ను తయారు చేయాలని వారు సన్నాహాలు మొదలుపెట్టారు. మనిషి శరీరంలో నుండి వచ్చే చెమట ద్వారా వారి శరీర యాక్టివిటీని ఈ స్మార్ట్ ఫ్యాబ్రిక్స్ కనిపెడుతూ ఉంటాయి. మనిషి శరీరం నుండి వచ్చే చెమట సాయంతో హైడ్రేషన్‌ను స్టడీ చేయాలంటే చాలా సమయం పడుతుందని, అందుకే స్మార్ట్ ఫ్యాబ్రిక్స్ మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం కావాలని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News