BigTV English

Snoring : గురక ఎందుకు పెడతారో తెలుసా..? దీనివల్ల వచ్చే సమస్యలేంటి..!

Snoring : గురక ఎందుకు పెడతారో తెలుసా..? దీనివల్ల వచ్చే సమస్యలేంటి..!

Snoring : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్రపోవడమే గగనంగా మారింది. కొందరు ఏదో పోయాం అన్నట్లుగా ఉంటే.. మరికొందరు ఈ ప్రపంచాన్నే మరచి నిద్ర పోతుంటారు. ఇదే సమయంలో ఎవరైనా నిద్రలో గురకపెడితే.. వామ్మో ఆ నరకానికి మించింది మరొకటి ఉండదు. ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లమ్. గురకతో ఇంటిల్లిపాదీ జాగారం చేస్తుంటారు.


అయితే ఈ గురక రావడానికి కారణం ఏంటి? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు గురుక సమస్యతో బాధపడుతున్నట్లు నెదర్లాండ్స్‌కి చెందిన ఎరామస్ మెడికల్ సెంటర్‌ పరిశోధనలు చెబుతున్నాయి. 7500 మందిపై వారు పరిశోధనలు జరిపారు. గురక సమస్య అనేది వయస్సు పెరిగేకొద్ది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.


గురక ఎందుకు వస్తుంది..?

నిద్రలో ఉన్నప్పుడు శ్వాసనాళాలు కుంచించుకుపోవడాన్ని పార్షియల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ అంటారు. ఇలా జరిగినప్పుడు గురక రావడం మొదలువుతుంది. ఈ మార్గం పూర్తిగా మూసుకుపోవడాన్ని స్లీప్ ఆప్నియా అంటారు. దీని కారణంగా శ్వాస మార్గంలో అవరోధం ఏర్పడి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. నిద్రకు ఇబ్బంది కలిగినప్పుడే మళ్లీ శ్వాస మార్గం తెరుచుకుంటుంది.

ఈ స్లీప్ ఆప్నియాతో బాధపడేవారు గంటకు 15 నుంచి 25 లేదా 50 సార్లు నిద్రకు భంగం కలుగుతుంది. ఎందుకంటే వారి శ్వాసమార్గం తెరుచుకోవడానికి నిద్రలేవాల్సి ఉంటుంది. దీని కారణంగా గాఢనిద్ర సాధ్యం కాదు.

గడ్డం దగ్గర కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నందున గురక వస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంచితే గురక రాకుండా ఉండే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ జలుబు చేసి ముక్కు మూసుకుపోతే గురక ఎక్కువగా రావొచ్చు. అలాంటప్పుడు నిద్రపోయే ముందు ముక్కును శుభ్రం చేసుకోవాలి.

ఆల్కహాల్ కారణంగా నిద్రలో కండరాలు మరింత రిలాక్స్ అవుతాయి. ఈ సమయంలో శ్వాసమార్గం ఇరుకుగా మారుతుంది. అందువల్ల నిద్రపోయే ముందు మద్యం తాగకుండా ఉంటే మంచిది.

అలానే మీ వెనుకభాగంలో చదునుగా పడుకున్నప్పుడు నాలుక, గడ్డం, గడ్డం కిందున్న కొవ్వు కణజాలం వాయుమార్గంలో అడ్డంకులను సృష్టిస్తాయి. వెల్లకిలా పడుకున్నప్పుడు నాలుక గడ్డం, గడ్డం కింద భాగంలో ఉండే కొవ్వు కణజాలం శ్వాసమార్గంలో అవరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా పడుకున్నప్పుడు గురక గనుక వస్తున్నట్లయితే ఒక పక్కకు తిరిగి పడుకోండి.

కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, డిప్రెషన్, గుండె జబ్బులు, అలసిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. నవజాతి శిశువు 14-17 గంటలు, 14-17 ఏళ్లు వయస్కులు 8-10 గంటలు నిద్రపోవాలి. 18 -26 ఏళ్లున్న యువత, 26-64 ఏళ్ల మధ్య వయస్కులు 7-9 గంటలు, 65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటలు నిద్ర అవసరం. నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నాయంటే ఆసల్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×