BigTV English

NASA : మనుషుల పేర్లతో స్పేస్‌క్రాఫ్ట్ ప్రయాణం.. నాసా ప్రయోగం..

NASA  : మనుషుల పేర్లతో స్పేస్‌క్రాఫ్ట్ ప్రయాణం.. నాసా ప్రయోగం..


NASA : ఈరోజుల్లో టూరిజంకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. భూమిపైనే కాదు.. అంతరిక్షంలోకి కూడా ఎగరాలన్న ఫ్యాంటసీ చాలామందిలో ఎక్కువయ్యింది. అందుకే స్పేస్ టూరిజం కూడా వారి ఫ్యాంటసీని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలతో పాటు ఎన్నో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు కూడా టూరిజంను పెంచుకోవాలని చూస్తున్నాయి. దాంతో పాటు నాసా.. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో ప్రజల ముందుకు వస్తోంది. అదే ‘మెసేజ్ ఇన్ ఏ బాటిల్’.

నాసా.. యూరోపా క్లిప్పర్ పేరుతో ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను వచ్చే ఏడాది అంతరిక్షానికి పంపించనుంది. ఎవరైనా ఒక మైక్రోచిప్‌పై తమ పేరు రాసుకొని ఈ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించవచ్చని ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు. 2024 అక్టోబర్‌లో ఈ యూరోపా క్లిప్పర్ అనేది జూపిటర్‌తో పాటు దాని మూన్ యూరోపా చుట్టూ ఒక రౌండ్ వేయడానికి సిద్ధమవుతోంది. 2023 డిసెంబర్ 31న రాత్రి 11.59లోపు ఎవరైతే మెసేజ్ ఇన్ ఏ బాటిల్‌లో రిజిస్టర్ అవుతారో.. వారి పేరు ఆ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనుంది. పేరుతో పాటు లారెట్ అడా లిమన్ రాసిన ప్రత్యేకమైన కవిత కూడా అంతరిక్షానికి వెళ్లనుందని చెప్పారు.


పేరుతో పాటు ఈ కవిత కూడా ఒక బాటిల్‌లో పొందుపరిచి ఉంటాయని నాసా ప్రకటించింది. ఈ బాటిల్ అనేది ఎన్నో బిలియన్ల మైళ్ల దూరం ప్రయాణించి యూరోపాకు చేరుకుంటుంది. అక్కడ ఉన్న ఐసీ క్రస్ట్‌పై మానవాళి జీవనం కొనసాగుతుందా లేదా తెలుసుకోవడం ఈ స్పేస్‌క్రాఫ్ట్ లక్ష్యం. ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ వారి అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవచ్చు. #SendYourName అనే ట్యాగ్‌తో దీని గురించి సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు.

సైన్స్, ఆర్ట్, టెక్నాలజీ అన్నీ కలగలిపిన ప్రోగ్రామ్.. మేసేజ్ ఇన్ ఏ బాటిల్ అని నాసా ప్రకటించింది. దీని ద్వారా యూరోపా క్లిప్పర్ గురించి అందరికీ తెలియడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సోలార్ సిస్టమ్ దాటేసి మన పేర్లు అనేవి వేరే గ్రహంలోకి వెళతాయి అనే ఆలోచన చాలా బాగుందని చెప్పింది. ఇప్పటికే ఎన్నో ఇతర స్పేస్‌క్రాఫ్ట్స్ ద్వారా నాసా ఇలాంటి ప్రయోగం చేసింది. ఇలాంటి ప్రయోగాలు నాసాకు కొత్తేమీ కాదని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈసారి క్లిప్పర్ ప్రయోగంతో మనుషుల పేర్లు జుపిటర్‌కు చేరుకోనున్నాయని చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×