BigTV English

Rice for Diabetics in Assam : అస్సాం రైస్.. షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా..

Rice for Diabetics in Assam : అస్సాం రైస్.. షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా..
Rice for Diabetics

Rice for Diabetics in Assam : షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు జీవితాంతం వారి వ్యాధికి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూనే ఉండాలి. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా షుగర్ అనేది అందరినీ మహమ్మారిలాగా పీడిస్తోంది. కొందరు మొదటి స్టేజ్‌లోనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే.. మరికొందరు మాత్రం తప్పక కఠినమైన చికిత్సలు తీసుకోవాల్సి వస్తోంది. తాజాగా షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినగలిగే బియ్యాన్ని ఇండియాలోనే కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇది పేషెంట్లకు శుభవార్త అని చెప్తున్నారు.


మామూలుగా షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నం ఎక్కువగా తినకూడదు. అలాంటి వారికోసం బ్రౌన్ రైస్ లాంటి చాలారకాలు రైస్‌ల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇండియాలోని అస్సాంలో పండించే జోహా రకం రైస్ కూడా షుగర్ వ్యాధి పేషెంట్లకు మంచి చేస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పైగా ఇది బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించి, డయాబెటీస్‌ను దూరం చేస్తుందన్నారు. ఈ రైస్ షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుందని కనిపెట్టారు.

జోహా రైస్ నుండి ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. ఇదే ఈ రైస్‌ను ఇతర రైస్‌ల నుండి వేరు చేస్తుంది. దీని సువాసన మాత్రమే కాదు టేస్ట్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. షుగర్ వ్యాధికి మాత్రమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఈ రైస్ బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జోహా రౌస్ గురించి శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాలను ఒక ప్రకటన ద్వారా బయటపెట్టారు.


జోహా రైస్‌లో లైనొలిక్ యాసిడ్, లైనొలినిక్ యాసిడ్ లాంటి రెండు రకాల యాసిడ్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు గమనించారు. ఇవి నేచురల్‌గా మనిషి శరీరంలో తయారు కాలేవని అన్నారు. మానసిక ఆరోగ్యానికి ఈ యాసిడ్స్ ఎంతో ఉపయోగపడతాయని బయటపెట్టారు. పైగా సువాసన వెదజల్లే జోహా రైస్‌లోనే ఈ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే జోహా రైస్‌ను రైస్ బ్రాన్ ఆయిల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్ కూడా డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×