Big Stories

Sun Effect : సూర్యుడి నుండి జ్వాల.. టెక్నాలజీలపై ఎఫెక్ట్..

Sun Effect

Sun Effect : ఈమధ్య కాలంలో స్పేస్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు స్పేస్‌ను కనిపెడుతూ ఉండే ఆస్ట్రానాట్స్ కూడా వాటిని గమనించలేకపోతున్నారు. అంత ఫాస్ట్‌గా ఈ పరిణామాలు జరిగిపోతున్నాయి. ఇప్పటికే సోలార్ స్టార్మ్ ఎఫెక్ట్ నుండి బయటపడని ఆస్ట్రానాట్స్.. వాటి గురించి క్షుణ్ణంగా పరిశోధనలు మొదలుపెట్టారు. ఇకపై సోలార్ స్టార్మ్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ఇంతలోనే అలాంటి ఒక సంఘటననే మళ్లీ వారికి ఎదురయ్యింది.

- Advertisement -

తాజాగా సూర్యుడి నుండి ఒక ఎక్స్ క్లాస్ సోలార్ జ్వాల వెలువడిందని ఆస్ట్రానాట్స్ కనుగొన్నారు. ఈ జ్వాల ఎక్స్ 1.2 ఫ్లేర్‌గా విభజించబడింది. మామూలుగా ఎక్స్ క్లాస్ అనేది చాలా అత్యంత తీవ్రమైన ఫ్లేర్‌గా చెప్పుకోబడుతుంది. ఈ సోలార్ ఫ్లేర్‌ను మొదటిగా నాసా సోలార్ డైనమిక్స్ ఆబ్జర్వేటరీ కనిపెట్టింది. ఇది సోలార్ సిస్టమ్‌లోని సెంట్రల్ స్టార్ అయిన ఏఆర్3256లోని సన్‌స్పాట్ నుండి వచ్చిందని ఆస్ట్రానాట్స్ తెలుసుకున్నారు. ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ అనేవి భూమిపైన నడిచే రేడియో బ్లాక్‌ఔట్స్‌కు కారణమవుతుందని వారు గమనించారు.

- Advertisement -

తాజాగా జరిగిన ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ వల్ల సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రేడియో బ్లాక్‌ఔట్స్ జరిగాయని తెలుస్తోంది. మామూలుగా సోలార్ స్టార్మ్స్ అనేవి నాలుగు క్లాసెస్‌లో ఉంటాయి. అవే బీ, సీ, ఎమ్, ఎక్స్. భూకంపం వచ్చినప్పుడు రిక్టార్ స్కేల్‌పై రీడింగ్ ఎలా ఉంటుందో.. సోలార్ ఫ్లేర్స్‌ తీవ్రతను కనుక్కోవడానికి కూడా లాగర్థమిక్ స్కేల్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే సీ క్లాస్ స్టార్మ్ అనేది బీ క్లాస్ స్టార్మ్ కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుంది.

ఎక్స్ క్లాస్ అనేది ఫ్లేర్ యొక్క బలాన్ని చెప్పడానికి ఉపయోగించే పదం. స్కేల్‌లో దీని బలాన్ని తెలుసుకున్న తర్వాత అది ఏ క్లాస్ అని తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చే నెంబర్ దీనిని సబ్ డివిజన్స్‌లాగా విభజించబడుతుంది. ఉదాహరణకు ఎక్స్ 1 నుండి ఎక్స్ 9 వరకు ఈ సబ్ డివిజన్స్‌ను విభజించవచ్చు. దీన్ని బట్టి చూస్తే.. తాజాగా సంభవించిన ఎక్స్ 1.2 ఫ్లేర్ అనేది బలమైనది కాకపోయినా.. ప్రపంచంలోని చాలావరకు దేశాల్లో టెక్నాలజీలపై ఇది ఎఫెక్ట్ చూపించింది.

గతకొన్ని వారాలుగా సోలార్ యాక్టివిటీ అనేది అనూహ్యంగా మారుతోంది. ఇటీవల భూమికి తగిలిన సోలార్ స్టార్మ్‌ను మరువక ముందే సోలార్ ఫ్లేర్ సంభవించి రేడియో బ్లాక్‌ఔట్స్ జరగడం అనేది ఆస్ట్రానాట్స్‌ను ఆలోచనలో పడేసింది. పైగా ఆ సోలార్ స్టార్మ్‌ను కొందరు మాత్రమే గుర్తించడం అందరికీ ఆశ్చర్యం కలిగేలా చేసింది. యూఎస్ స్పేస్ ప్రిడిక్షన్ సెంటర్ ప్రకారం ఇలాంటివి ఇంకా కొనసాగుతాయి. ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి సోలార్ స్టార్మ్స్ సంభవించే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News