Big Stories

Lokesh vs Kethireddy: ఫాంహౌజ్ ఫైట్.. లోకేశ్ వర్సెస్ కేతిరెడ్డి..

LOKESH Vs KETHIREDDY

Lokesh vs Kethireddy: లోకేష్ పాదయాత్రతో అనంతపురం జిల్లా ధర్మవరంలో రాజకీయ వేడి రాజుకుంది. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా మరింత దుమారం రేపాయి. MLA కేతిరెడ్డిపై లోకేష్ అవినీతి ఆరోపణలు చేయగా.. కేతిరెడ్డి అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమాలను ఆధారాలతో నిరూపించాలంటూ లోకేష్‌కు సవాల్ విసిరారు.

- Advertisement -

ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన లోకేష్.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అందరికీ నీతిని బోధించే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం.. గుట్టలు ఆక్రమించుకుంటారని లోకేశ్ ఆరోపణ. ఎర్రగుట్టను కబ్జా చేసి కేతిరెడ్డి విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారంటూ వీడియో బయటపెట్టారు. కేతిరెడ్డి ఫామ్‌హౌస్‌కు సంబంధించిన చిత్రాలు హాట్ టాపిక్ అయ్యాయి.

- Advertisement -

గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం కేతిరెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కాజేశారని ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించారని అన్నారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి సదరు సర్వేనెంబర్‌పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారు చేశారని తెలిపారు. టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామన్నారు లోకేశ్.

లోకేష్ వ్యాఖ్యలపై కేతిరెడ్డి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపిస్తే MLA పదవికి రాజీనామా చేస్తానని కేతిరెడ్డి సవాల్ విసిరారు. లేదంటే లోకేష్‌ పాదయాత్రకు ప్యాకప్‌ చేసి, రాజకీయాలకు నుంచి వైదొలగలాని ఛాలెంజ్ చేశారు. ఉండవల్లిలోని కరకట్ట దగ్గరి చంద్రబాబు నివాసానికి వెళ్లిన కేతిరెడ్డి.. చంద్రబాబు ఇళ్లే అక్రమ కట్టడం అని ఆరోపించారు. చంద్రబాబు నది వెంబడి భూములు లాక్కుని ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు.

ఇలా, లోకేష్ ఆరోపణలు- కేతిరెడ్డి సవాళ్లతో ధర్మవరం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News